వాహనదారులకు చమురు కంపెనీలు ఊరటనిచ్చాయి. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 15 పైసలు తగ్గించాయి. తగ్గిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.49, డీజిల్ ధర రూ.88.92కు చేరింది. ముంబైలో పెట్రోల్ లీటర్‌కు రూ.107.52, డీజిల్ రూ.96.48కు చేరింది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు తగ్గి రూ.105.6గా ఉంది. డీజిల్ ధర 16 పైసలు తగ్గి రూ.97.05గా ఉంది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.55గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.54గా ఉంది. కాగా, దాదాపు 35 రోజుల తర్వాత రెండు రోజుల కిందట పెట్రోల్ 20 పైసలు తగ్గిన విషయం తెలిసిందే.