ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల మూసిన సినిమా థియేటర్స్ ని తిరిగి తెరిచేందుకు , థియేటర్ లైసెన్స్ లను పునరుద్ధరించుటకు నెల రోజుల గడువుని ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినందులకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేయుచున్నాం. ఈ విషయంలో మాకు సహకరించిన సమాచార, ప్రజా సంబంధాల ,సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు పేర్ని నాని , కుమార్ విశ్వజిత్, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ డిపార్టుమెంట్ కి , ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు టి.ఎస్.విజయచందర్ , మేనేజింగ్ డైరెక్టర్టి.వి.కె. రెడ్డికి చిత్రపరిశ్రమతో అనుబంధం ఉన్న ఇతర మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపిలకి కృతజ్ఞతలు తెలియచేయుచున్నాం.అలాగే, చిత్ర పరిశ్రమకు సంబందించిన థియేటర్ అడ్మిషన్ రేట్స్ , పెండింగ్ విషయములు కూడా అతి త్వరలో సానుకూలంగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు నారాయణదాస్ కిషన్ దాస్ నారంగ్, గౌరవ కార్యదర్శులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్,ఎం. రమేష్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..