సుల్తానాబాద్ : మహాశివుని అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గుడి మిట్టపల్లి లో గల శ్రీ శివాలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మూడు రోజులు నిర్వహిస్తున్న హోమం మహా రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా శివుడికి అభిషేకం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ.. అతి పురాతనమైన మహా శివాలయం ఊరుకు ఈశాన్యంలో ఉండడంతో పలువురు దాతల సహకారంతో శివాలయాన్ని పునర్ నిర్మాణం చేపట్టేందుకు వేద పండితులు హోమం మహా రుద్రాభిషేకం తో పాటు వివిధ పూజా కార్యక్రమాలు చేపడుతూ ఆలయాన్ని నిర్మించేందుకు బ్లూ ప్రింట్ ను సైతం చేపట్టారని అన్నారు. త్వరలోనే ఆలయాన్ని పీఠాధిపతుల ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేపట్టి భక్తులకు పూజలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఆలయాన్ని మహా అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆ దేవదేవుడి పూజలను పొందే భావ్యం కలుగుతుందని అన్నారు. పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రుద్రాభిషేకం చేపట్టారు. వేద పండితులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు నగునూరి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఐల రమేష్, కోశాధికారి అయిత రమేష్, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, రైస్ మిల్లర్లు ఎడవల్లి రాంరెడ్డి, చకిలం మారుతి, చకిలం సత్యనారాయణ, మాడూరి ప్రసాద్, చకిలం సంజీవ్, పల్ల సురేష్, కొమురవెల్లి భాస్కర్, పవన్, అశోక్, టిఆర్ఎస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు, పారుపల్లి గుణపతి, మున్సిపల్ కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా వేద పండితులు ఉప్పర మల్యాల లక్ష్మణ్ శర్మ ఆధ్వర్యంలో పండితులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement