పిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పిఠాపురం పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సమావేశాలు, బహిరంగ సభలు, సమీక్షలు, ప్రార్థనలు ఇలా సాగుతోంది ఆయన పర్యటన..ఎన్నికల ప్రచారానికి తాను బరిలోకి దిగుతోన్న పిఠాపురం నుంచే శ్రీకారం చుట్టిన ఆయన.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతోన్న విషయం విదితమే కాగా.. నాలుగో రోజు పిఠాపురం పర్యటనలో భాగంగా ఇవాళ పవన్ కల్యాణ్ స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా భార్య క్రిస్టియన్ అని గుర్తుచేశారు.. అయితే, నేను ఎన్నికల కోసం చర్చికి రాలేదని స్పష్టం చేశారు. తనను తాను తగ్గించుకునువాడు హెచ్చించును అన్నారు. ఇక, మా కుటుంబంలో సర్వ మతాలను గౌరవించేవారు.. అన్ని మతాలను నేను గౌరవిస్తాను అన్నారు. అంతేకాదు.. జీసస్ నడిచిన బెత్లెహేముకి కూడా నేను వెళ్లానని పవన్ కల్యాణ్ తెలిపారు.