Tuesday, November 26, 2024

పితృ ఋణం తీర్చేది…మహాలయ పక్షం!

ప్రతీ సంవత్సరం భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుండి, అమావాస్య వరకు ఉన్న పక్షాన్ని పితృ పక్షం లేదా మహాలయ పక్షం అంటారు. ఈ రోజు ల్లో మనం ప్రతీ ఒక్కరూ పితృ ఋణం తీర్చడానికి శ్రాద్ధకర్మలు చేయవలసిన కర్తవ్యం ఉంది. మనం పుడుతూనే మూడు ఋణాలతో జన్మిస్తాము. అవే పితృఋణం, దైవ ఋణం, ఋషి ఋణం. ఇవికాక ఇంకా అతిథి ఋణం వంటివి కూడా ఉంటాయి.
ఆదిశంకరాచార్య ”దైవ పిత్య్రై కర్మణి కర్తవ్యై” అన్నారు. అంటే, దేవతల, పితృ దేవతల, కర్మలను తప్పక ఆచరించాలని చెప్పారు.
”పిత్రణాంచ ప్రసాదేన కర్తృత్వం శోభి వర్థతే|
శ్రేయం సాచభివృద్ధి స్యాత్‌ భూయాసాం ఉత్తరోత్తమం||”
పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి, వంశాభివృద్ధి, సత్సంతానం, మంచి శ్రేయస్సు కలుగుతాయి అని పురాణాలు వివరిస్తున్నాయి. చాలామంది అనుకుంటారు ”ప్రతీ సంవత్సరం ఆబ్దిdకం పెడుతున్నాము కదా! ఇక ఈ మహాలయ పక్షంలో ఏ కా ర్యం చేయవలసిన అవసరం లేదు” అని. ఆ భావన తప్పు. ఈ పితృపక్షంలో విధిగా శ్రా ద్ధం పెట్టాలి. అలాగే బ్రహ్మ కపాలంలో, గయ పుణ్యక్షేత్రంలోనో పిండప్రదానం చేసా మని ఆబ్దిdకాలు పెట్టడం మానేస్తున్నారు చాలామంది. దీనివల్ల పితృదోషం వస్తుంది.

మహాలయ పక్ష ప్రాధాన్యత

దక్షిణాయనంలో వచ్చే ఈ మహాలయ పక్షం పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం.
”మహాన్‌ ఆలయ: మహాన్‌ లయ: మహత్‌ అలం యతీతవా” అంటారు. అంటే సాధారణ దేవతలు ఉండే దానిని ఆలయం అంటే, పితృ దేవతలు ఉండే ఆలయమే మహాలయం. మరణించిన పితృ దేవతలకు వారి కర్మ పరిపక్వమై, ఉత్తమ గతులు పొందడానికి, వారి సంతతి ఈ పితృ పక్షంలో శ్రాద్ధకర్మలు చేసి, తర్పణాలు ఇవ్వాలి. అప్పుడే పితృ ఋణం తీరుతుంది. ఈ మహాలయ పక్షంలో పితృ దేవతలు తమ సంత తి ఇంటికి ఏదో ఒక రూపంలో అన్నాన్ని, జలాన్ని ఆశించి వస్తారని ప్రతీతి. అలా ఈ మహాలయ పక్షంలో పితృ శ్రాద్ధం పెడితే, సంవత్సరం అంతా తృప్తి పొందుతారని నిర్ణయ సింధు శాస్త్రం చెబుతోంది.

పితృ ఋణం తీరిస్తే కలిగే లాభాలు

పితృ ఋణం తీర్చుకుంటే వంశం అభివృద్ధి పొందుతుంది. సంతానం జ్ఞానవం తులై, పేరు ప్రఖ్యాతులు పొందుతారు. పితృదేవతలకు వారి కర్మ పరిపక్వమై, పుణ్యలో కాలు సిద్ధిస్తాయని స్కాందపురాణం చెబుతోంది. పితృదేవతల అనుగ్రహంతో బాటు, దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది.
పితృ దేవతలకు తర్పణాలు వదలకపోతే, వారి శాపానికి గురి కావలసి ఉంటుం ది. దీనివల్ల పిల్లలకు పితృదోష కారణంగా వివాహాలు జరగకపోవడం, జరిగినా, సంతతి అనారోగ్యాలతో, ఆర్థిక సమస్యలతో బాధపడతారు. ఈ పక్షంలో ప్రతీరోజూ స్నానం చేసిన తరువాత, తల్లిదండ్రులను, తాతముత్తాత వంటి వంశీయులను తలచు కొని తిలలతో తర్పణాలు దర్భలు మీద వదలడం చేయాలి. తండ్రి పోయిన తిథి ఆధా రం చేసుకుని ,ఆ రోజు పితృ శ్రాద్ధం పెట్టాలి. ఆ రోజు కుదరకపోతే, ఆఖరుగా మహాల య అమావాస్య రోజున విధిగా ఆచరించాలి. అంటే ఆబ్దిdకం రోజున భోక్తలతో, మంత్ర పూర్వకంగా ఎలా చేస్తామో అదేవిధంగా చేయాలి. ఆర్థిక సమస్య వల్లకాని, ఏ ఇతర ఆటంకాలు వల్లనైనా పితృ శ్రాద్ధం చేయలేకపోతే, కనీసం ఒక పురోహతుడుకు స్వయం పాకం (బియ్యం, పెసర పప్పు, కూరలు, చింతపండు వంటివి) ఇచ్చి, సంకల్ప పూర్వ కంగా తిలలు వదలాలి. అదీ చేయలేని అశక్తులు ”స్నానానంతరం రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి నమస్కరించి, నీటిని పెద్దల పేర్లు చెప్పి, వదలాలి. తదుపరి నమ స్కరించి ”నేను ఇంతకన్నా ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్నాను క్షమించండి.” అని ప్రార్థిస్తే, దయతో ఆశీస్సులు అందచేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు రెండు ఉదాహ రణలు పరిశీలిద్దాం.
మహాభారతంలో ఒక ఉపాఖ్యానంలో జరత్కారుడు అనే పండితుడు, మహర్షి, తాను వివాహం చేసుకొని సంసార బంధనంలో చిక్కుకోకుండా, మోక్షసిద్ధికై తపస్సు చేయడానికి బయలుదేరి వెడుతూంటే, మార్గమధ్యంలో ఒక అడవిలో ఒక గడ్డి దుబ్బు కు కొంతమంది ఋషులు వ్రేలాడుతుండడం చూసి ”ఎవరు మీరు? ఎందుకు వ్రేలాడు తున్నారు?” అని అడిగాడు. దానికి వారు ”మేము నీ పితృ దేవతలం. నువ్వు వివా#హం చేసుకొని పుత్ర సంతానం పొంది, మాకు యథావిధిగా శ్రాద్ధ విధి చేస్తూంటే పుణ్యలోక ప్రాప్తి మాకు కలుగుతుంది.” అనగానే జరత్కారుడు తన తపస్సు కార్యాన్ని వాయిదా వేసి, వివాహం చేసుకొని, పితృ ఋణం తీర్చుకొన్నాడు.
మరో ఉదాహరణ దానశీలిగా పేరు పొందిన కర్ణుడు, తాను మరణించిన పిదప స్వర్గలోకానికి బయలుదేరి వెడుతుండగా, దారిలో ఆకలి, దాహం పీడించసాగాయి. అపుడు దారిలో కనపడిన ఒక వృక్షానికి ఉన్న పండు కోయసాగాడు. పండును పట్టుకోగానే అది కాస్త బంగారం పండుగా మారిపోయింది. ఇంకోచోట మరో పండు కోయబోగా, అలాగే జరిగింది. పోనీ దాహం తీర్చుకుందామని ఒక తటాకం కనపడితే, వెళ్ళి దోసిలిలో నీళ్ళు తీయగానే, అవి బంగారంలా మారిపోయాయి. అప్పుడు
”నేను చేసిన తప్పేమిటి? ఎందుకు నాకు క్షుద్భాధ, దాహం పీడించసాగాయి?” అనుకొంటుండగా ”ఓ! కర్ణా! నువ్వు వాస్తవానికి గొప్ప దానశీలివే. కాని నువ్వు ఎవ్వరికీ అన్నదానం, జలదానం చేయని కారణంగా ఈ కష్టం వచ్చింది.” అని ఆకాశవాణి పలి కింది. అది విన్న కర్ణుడు తన తండ్రి సూర్యుడు వద్దకు వెళ్ళి ప్రాధేయపడ్డాడు. అప్పుడు దేవేంద్రుడు సూర్యుడు సలహా మేరకు కర్ణుని తిరిగి భూలోకానికి పంపి అన్నదానం, జలదానం చేయమని సూచించారు. అప్పుడు కర్ణుడు భూలోకంలోకి వచ్చి అన్నదా నం, జలదానం చేసాడు.
పితృఋణం తీర్చడానికి పితృదేవతలకు తర్పణాలు వదిలి వెళ్ళాడు. అప్పుడు పుణ్యలోక ప్రాప్తి సిద్ధించింది. అందుకే మనం కూడా బ్రతికి ఉండగానే అన్నదానం, జలదానం తోబాటు, పితృఋణం తీర్చడానికి ఆబ్దిdకాలు, మహాలయ పక్షం అనే ప్రత్యే క రోజుల్లో తీర్చుకొంటే మనం మన కర్తవ్యం ధర్మంగా చేసినట్లే! మంచి సంతానంతో పాటు సంపదలు ఆయుష్‌ పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement