హైదరాబాద్, ఆంధ్రప్రభ : సాధారణ, స్లీపర్‌క్లాస్ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24 అక్టోబర్ వరకు సాధారణ మరియు స్లీపర్ తరగతి ప్రయాణీకుల సంఖ్యలో పెరుగుదలను నమోదు చేసినట్లు సీపీఆర్‌వో రాకేష్ తెలిపారు.
ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో మొత్తం 15.75 కోట్ల మంది ప్రయాణించారని తెలిపారు. ఇందులో జనరల్ , స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించిన వారి సంఖ్య 14.32 కోట్లు- అని, ఎసి కోచ్‌లలో ప్రయాణించిన వారి సంఖ్య 1.43 కోట్లు అని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జోన్‌లో నాన్ ఏసీ కోచ్‌లలో 1.01 కోట్లు- మరియు ఏసీ కోచ్‌లలో 27 లక్షల అదనపు ప్రయాణికులు రాకపోకలు సాగించారని వివరించారు.