అయినవిల్లి, ప్రభన్యూస్: తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండల సర్పంచ్ ల సమాఖ్య ఎన్నిక రసాభాసగా ముగిసింది. శుక్రవారం స్థానిక క్షణముక్తీశ్వర స్వామి ఆలయంలో మండలంలోని 21 గ్రామపంచాయితీల సర్పంచులు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అధ్యక్ష బరిలో అధికార పార్టీ నుంచి నేదునూరు సర్పంచ్ గుమ్మడి ప్రసాద్, తొత్తరమూడి సర్పంచ్ వారా జయసావిత్రి, మాగం సర్పంచ్ కాశి వి.వి.సత్యనారాయణ, వెలువలపల్లి సర్పంచ్ బొంతు మణి, టీడీపీ నుంచి కాకర శ్రీనివాస్ అధ్యక్ష పదవిని ఆశించారు. కానీ సమావేశంలో సర్పంచ్ ల మధ్య ఏకాభిప్రాయం కుదరక వాగ్వివాదాలు జరిగాయి.
ఒకానొక దశలో ఇరు పార్టీల సర్పంచ్ ల మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఎన్నిక జరిపించాలని ఒక వర్గం, వాయిదా వేయాలని ఒకవర్గం గట్టిగా పట్డుబట్టారు. దీంతో చేసేదేమీలేక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సమక్షంలో మరోసారి సమావేశం నిర్వహించుకొని అద్యక్ష ఎన్నిక నిర్వహించుకుందామని కొందరు తెలపడంతో సర్పంచ్ లు ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేసుకొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..