దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకి ప్రీక్వెల్ తీయబోతున్నారు. బాహుబలి సినిమా దర్శకుడు రాజమౌళి తో కలిసి నెట్ ఫ్లిక్స్ సంస్థ 9 ఎపిసోడ్ ల చొప్పున రెండు సీజన్ లను ప్లాన్ చేసింది. బాహుబలి- బిఫోర్ ది బిగినింగ్ పేరుతో కథను సిద్ధం చేసుకుంది. ఇక మృణాల్ ఠాకూర్ ఈ సిరీస్ లో శివగామి పాత్రను పోషించింది. అయితే ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ కొంతవరకు పూర్తయింది కూడా. కాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన అవుట్ ఫుట్ ను చూసిన నెట్ ఫ్లిక్స్ బృందం అసంతృప్తి వ్యక్తం చేసిందట.
ఇలాంటి సిరీస్ ను ప్రచారం చేస్తే సంస్థకు చెడ్డపేరు వస్తుందని 100 కోట్లతో తీసిన ఈ మొత్తంను పక్కనపెట్టేసిందట. కానీ బాహుబలి కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సారి 200 కోట్లు బడ్జెట్ కేటాయించి మరింత క్వాలిటీతో బాహుబలి -బిఫోర్ ది బిగినింగ్ ప్లాన్ చేశాడట. అయితే నటీనటుల విషయంలో మార్పులు కూడా ఉండబోతున్న ట్లు తెలుస్తోంది. శివగామి పాత్ర లో మృణాల్ ఉంటుందా తప్పిస్తారా అనేది కూడా డౌటే. ఈ సిరీస్ తో కోట్లు గడించాలని ఆలోచించిన నెట్ ఫ్లెక్స్ ఇప్పటికే వంద కోట్లను ఖర్చు పెట్టి మరో 200 కోట్లను పెట్టడానికి సిద్ధమైంది. మొత్తం 300 కోట్లు ఖర్చు పెట్టబోతుంది. మరి బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ ఏ స్థాయిలో ఆకట్టుంటుందో చూడాలి.