గుడి అంటే నిత్యదీపారాధన వెలుగుతూనే ఉంటుందని తెలుసు. కానీ ఈ దేవాలయం చాలా స్పెషల్..ఎందుకనుకుంటున్నారా..ఏడాదిలో కేవలం ఐదు గంటలు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుందట..ఆ సమయంలోనే అమ్మవారి దర్శనానికి అవకాశం కలిపిస్తారు పూజారులు. మరి ఈ ఆలయం స్పెషల్ ఏంటో తెలుసుకుందాం…ఇండియా అంటేనే హిందుత్వానికి ప్రతీక..ఎన్నో ఆలయాలు, మరెన్నో సంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం భారతదేశంలోని ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని గ్రియా బంద్ జిల్లాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలపై ప్రసిద్ధి చెందిన నీరాయ్ మాతా దేవాలయం ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారు సంవత్సరంలో కేవలం ఐదు గంటలు మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తుంటారు.
కావడానికి అమ్మవారి ఆలయం అయినా ఇక్కడో స్పెషల్ ఉందండోయ్.. ఈ ఆలయంలోకి మహిళలకి ప్రవేశం లేదు. అమ్మవారికి ముత్తయిదువులకి ఎంతో బంధం ఉంది. అయితే ఇక్కడ మాత్రం అది రివర్స్..అసలు ఆలయ ప్రవేశమే లేదు మహిళలకి..ఇది కూడా అంతుచిక్కని విషయమే. అంతే కాకుండా ఈ ఆలయంలో అమ్మవారికి గులాబీలు, కుంకుమ, బంధన్ లాంటివి ఉపయోగించరు. ఇక్కడ కేవలం కొబ్బరికాయ, అగర్బత్తిలను మాత్రమే ఉపయోగించి అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రి సమయంలో కాంతి స్వయంగా వెలిగిపోతుందని అంటారు. ఈ అద్భుతం ఎలా జరుగుతోంది.. ఇది ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కలేదు.
అదేవిధంగా ఆలయం వెలుపల తొమ్మిది రోజులపాటు నూనె లేకుండా దీపం వెలుగు తుందని అది కేవలం అమ్మ వారి మహిమ అని భక్తులు విశ్వసిస్తుంటారు. నీరాయ్ మాతా ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు.అసలు అమ్మవారి ఆలయంలోకి మహిళల ప్రవేశం ఎందుకు లేదనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కేవలం అమ్మవారి దర్శనం మాత్రమే కాకుండా ఈ అమ్మ వారి ప్రసాదం కూడా మహిళలు తీసుకోరు. ఈ విధంగా తీసుకోవటం వల్ల వారికి చెడు జరుగుతుందని భావిస్తారు. ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో కూడా మహిళలు కనిపించకపోవడం విశేషం. అసలు అమ్మవారు అంటేనే మహిళలకి ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మవారికి మహిళలు పూజ చేయకపోవడం కూడా గమనార్హం. కొన్ని కొన్ని విషయాలు మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ అంతుచిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా నిలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..