”గీతా సుగీతా కర్తవ్యా
కిమన్యై: శాస్త్ర విస్తరై:
యాస్వయం పద్మనాభస్య
ముఖపద్మాత్ విని: సృతా:”
మానవునిలోని అంతర్మథనాన్ని, మనోవేదనను దూరంచేసి అత డిని కర్తవ్యోన్ముఖుని చేయడం కోసం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుని ముఖారవిందం నుండి వెలువడిన మకరం దమే భగవద్గీత అని వేదవ్యాసుడు ప్రశంసించిన, ఉపనిషత్ సారమని పేరొందిన భగవద్గీతలోని భక్తియోగంలో నాల్గవ శ్లోకం ముముక్షువుల కు, అంటే, మోక్షార్థులకు ఉండవలసిన మూడు సుగుణాలను ఇలా పేర్కొనింది. ”సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమ బుద్ధయ:/ తే ప్రాఘ్నవంతి మామేవ సర్వభూతహతే రతా:”. ఎవరు ఇంద్రియ ములను బాగుగా నిగ్రహంచి, అంటే వాటిని స్వాధీనపరచుకొని, ఎల్లె డలా సమభావము కలవారై, సకల ప్రాణులకూ హతం కూర్చువారై ఉందురో వారు నన్ను (అంటే భగవానుని) పొందగలరు.
ఇందులో గీతాచార్యుడు పేర్కొన్న సుగుణత్రయమిది.
1) ఇంద్రియ నిగ్రహం (సన్నియమ్యేంద్రియ గ్రామం), (2) సమత్వబుద్ధి (సర్వత్ర సమ బుద్ధయ:), (3) అన్ని ప్రాణులహతము కోరుట (సర్వభూత హతేరతా:)
వీటిలో ఒక్కొక్క సుగుణాన్ని విశ్లేషించుకొందాం.
మొదటిది ఇంద్రియ నిగ్రహం
ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు కలిసి 10 ఇంద్రి యాలు. త్వక్ (చర్మం), చక్షు (కన్ను), రసన (నాలుక), శ్రోత్ర (చెవి), ఘ్రాణ (ముక్కు) అనేవి జ్ఞానేంద్రియాలు. వాక్ (మాట), పాణి (చెయ్యి), పాద (కాలు), పాయు (గుదము), ఉపస్థ (మూత్ర మార్గము), అనేవి కర్మేంద్రియాలు. వీటికి మనస్సును కూడా కలిపితే మొత్తం 11 ఇంద్రి యాలు అవుతాయి. మనస్సును ఇంద్రియ వశం కానివ్వకుండా, మన స్సు వశంలో ఇంద్రియాలను ఉంచుకోవడమే ఇంద్రియ నిగ్రహం అనబడుతుంది.
అత్యంత చంచలమైన మనస్సు, చంటిపిల్లలలాగా, అర్థంపర్థం లేని విషయాల పట్ల ఆకర్షింపబడుతూ, అల్లరి చేస్తూ ఉంటుంది. అభ్యా స, వైరాగ్యాలు అనే రెండు మార్గాల ద్వారా క్రమంగా దానిని నియం త్రించడం సాధ్యపడుతుందని భగవద్గీత చెబుతుంది. ఏకాగ్రతతో ధ్యా నం చేస్తూ, మితమైన సాత్విక ఆహారాన్నే తీసుకొంటూ, కోరికలను అదు పు చేసుకొంటూ ఉంటే క్రమంగా ఇంద్రియ నిగ్రహం సాధ్యపడుతుం ది. ”యతోయతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరమ్/ తతస్తతో నియ మ్యైతత్ ఆత్మన్యేవ వశంనయేత్”. ఎక్కడెక్కడో పరిపరివిధాలుగా సం చరిస్తున్న చంచలమైన మనస్సును, ఆయా ప్రదేశాల నుండి తీసు కొని వచ్చి ఆత్మయందే స్థిరం చేయాలి అని గీతాచార్యుని ఉపదేశం.
ఊర్వశి అర్జునుని అందచందాలకు శౌర్యపరాక్రమాలకు ఆకర్షితురాలై, తనంతటతానే వచ్చి మోహంచినా ఆ ప్రలోభంలో పడ కుండా, సున్నితంగా ఆమెకు ధర్మమార్గాన్ని వివరించి, నచ్చచెప్పి పంపి, ఇంద్రియ నిగ్రహానికి మేరు సమానమైన ఉదాహరణగా నిలి చిన అర్జునునిలాగా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించగలగాలి. అరిషడ్వ ర్గాలు నిరంతర శత్రువులు. సాధకుని మనస్సును కబళించి వేయడం కోసం సదా కాచుకొని ఉంటాయి. కనుక నిత్య జాగురూకతతో, నిరం తర సాధనతో ముముక్షువులు ఇంద్రియ నిగ్రహమనే ప్రథమ సుగుణా న్ని మొదట అలవరచుకోవాలి
రెండవ సుగుణం ‘సమత్వ బుద్ధి’
”సర్వభూతస్థమాత్మానం సర్వ భూతానిచాత్మని
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన:”
తనయందు సకల ప్రాణికోటినీ, సకల ప్రాణులలో తనను చూడగ ల్గినవాడే సమదర్శి. ”తనయందు నఖిల భూతములందు నొక భంగి సమహతత్వంబున బరగిన” ప్రహ్లాదుడు ఇందుకు ఉదాహరణప్రా యుడు. నిన్ను నీవెలా ప్రేమించుకొంటావో అలాగే ఇతరులను కూడా ప్రేమించమని ఆత్మౌపమ్య భావనను (ఇది విశ్వ సౌభ్రాతృత్వ భావన కన్నా పై మెట్టు) ప్రబోధించింది భగవద్గీత. లోకమంతా ఒకే భగవత్స్వ రూపమనీ, అన్నిటి యందు సమత్వ భావన కలిగి ఉండాలనీ బోధిం చింది. ”విద్యావినయ సంపన్నే బ్రాహ్మణగవి హస్తిని/ శునిచైవ శ్వపా నేచ పండితా: సమదర్శిన:”. విద్యావినయ సంపన్నులైన బ్రాహ్మణు లు, గోవులు, ఏనుగులు, కుక్కలు, చండాలురు… ఇలా అన్ని ప్రాణుల నూ, ఏ భేదభావమూ లేక, సమముగా భావించువాడే నిజమైన యోగి, ‘సమత్వం యోగ ఉచ్యతే’ అంటూ సమభావమే యోగమని గీత ప్రవచించింది. ”సమ: శత్రౌచ, మిత్రేచ, తథా మానావమానయో:/ శీతోష్ణ సుఖ దు:ఖే షు సమస్సంగ వివర్జిత:/ తుల్యనిందా స్తుతిర్మౌనీ, సంతుష్టోయే నకేనచిత్, అనికేత: స్థిరమతి: భక్తిమాన్మేప్రియో నర:”. సుఖదు:ఖములు, మానావమానములు, శీతోష్ణములు, నిందాస్తుతు లు, లాభాలాభ ములు, జయాపజయాలు, విభిన్న స్థితులందు సమ బుద్ధితో ప్రవర్తించు ధీరుడే మోక్షము పొందగలడని గీత వాగ్రుచ్చింది. అటువంటి జితాత్ముని యందు పరమాత్మ స్థిరంగా ఉంటాడని నొక్కి వక్కా ణించింది.
మూడవది సర్వ భూత హతం
కేవలం వాచా వేదాంతం కాకుండా అనుష్ఠాన (ఆచరణ) వేదాం తాన్ని బోధించిన భగవద్గీత సాధకునికి సర్వభూత సమత్వ భావనయే కాదు, సకల ప్రాణుల హతం కోరే బుద్ధీ ఉండాలని చెప్పింది. ”సర్వే భవంతు సుఖిన:, సర్వేసంతు నిరామయా:, సర్వే భద్రాణి పశ్యంతు, మాకశ్చిద్దు:ఖభాక్ భవేత్”. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణీ సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఏ దు:ఖాలూ లేకుండా ఉండాలని ఆకాంక్షిం చే వేద సంస్కృతి మనది. నిస్వార్థంగా, అందరి మంచినీ కోరుకొనే వాని చిత్తం దేవాలయమే. అందులో నిశ్చయంగా కొలువుండేది ఆ పరా త్పరుడే! గీతలో ”అద్వేష్టా సర్వ భూతానాం”, ”నిర్వైర స్సర్వ భూతే షు”, మొదలుగా చాలా శ్లోకాలలో ఈ సర్వ భూత దయా గుణము ఆవశ్యకత విస్పష్టంగా సూచింపబడింది. ”నితాంతాపార భూతద య” కలిగిన వానికి ఆ పరమేశ్వరుడు తప్పక ముక్తిని ప్రసాదించగల డు. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో ఉపదేశిం చిన ‘ సుగుణ త్రయం ‘ అనే ఈ మూడు రత్నాలు ముముక్షువులందరికీ శిరోధార్యాలు.