దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న వేళ మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
1.యువకులు గ్రూపులుగా ఏర్పడి కరోనా నిబంధనలు అమలు అయ్యేలా చొరవ తీసుకోవాలి. దీనివల్ల కంటోన్మెంట్ జోన్స్ లాక్ డౌన్ పెట్టాల్సిన అవసరం ఉండదు.
2.దవాయి బీ… కడాయి బీ… అంటూ నినాదాలు ఇచ్చిన మోడీ
3.12 కోట్ల మందికి పైగా ప్రజలకు వ్యాక్సిన్ అందించాం.
4.దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాలి.
5.అతి తక్కువ సమయంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకోగలిగిన ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో వ్యాక్సిన్ కు అనుమతులు ఇచ్చాము.
6.ఆక్సిజన్ రైలు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీరుస్తుంది.
7.జనవరి ఫిబ్రవరి తో పోలిస్తే ఇప్పుడు మందుల ఉత్పత్తి చాలా పెంచాం.
8. అవసరమైన వారికి సాయం అందించేందుకు అందరూ కృషి చేయాలి.
9. మనమందరం కలిసి ఈ పరీక్షను ఎదుర్కొందాం.
10. ఆక్సిజన్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కూడా ఈ దిశగా కృషి చేయాలి.
11. వైద్య సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నాను.