Wednesday, October 9, 2024

TG | మ‌రో రెండు రోజులు మోస్తరు వర్షాలు !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో రాగల రెండురోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

బుధవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, గురువారం నుంచి పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement