జిన్నారం : వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు మరణిస్తే కుటుంబం ఇబ్బందులు పడకూడదన్న సమున్నత లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు భీమా పథకాన్ని ప్రవేశపెట్టారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. జిన్నారం మండలం జంగం పేట గ్రామానికి చెందిన చెర్లపల్లి శ్రీరాములు, పెద్దమ్మ గూడెం గ్రామానికి చెందిన లక్ష్మీ అనే ఇద్దరు రైతులు ఇటీవల మృతి చెందారు. రైతు భీమా పథకం ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కులను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబీలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు భీమా రైతులకు కొండంత ధీమా అందిస్తొందని అన్నారు. గుంట భూమి ఉన్న రైతు సైతం రైతు భఈమా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు శంకర్ రెడ్డి, రాజేష్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతు భీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే..
By sree nivas
- Tags
- important news
- Important News This Week
- Important News Today
- jinaram
- Latest Important News
- laxmi
- mla mahipal reddy
- Most Important News
- raitu bheema cheq
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement