కుత్బుల్లాపూర్, (ప్రభ న్యూస్): హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు రవీందర్ ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ దూలపల్లిలో అభినందించారు. హైదరాబాద్ సైకిలిస్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు రవీందర్ నందనూరి ఆధ్వర్యంలో నవంబర్ 12వ తేదీన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీనగర్ లో మొదలైన కే 2 కే సైకిల్ రైడ్ 15వ రోజు 2550 కిలోమీటర్లు ప్రయాణిస్తూ తెలంగాణ మీదుగా వెళ్లడంతో శనివరం ఉదయం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను కుత్బుల్లాపూర్ పరిధిలోని దూలపల్లి సెంట్ మార్టిన్స్ వద్ద కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ… కే 2 కే రైడ్ విజయవంతంగా పూర్తి చేసేలా ముందుకు సాగాలన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సైక్లిస్ట్ గ్రూపులు కే2కే రైడ్ ను చూసి ముందుకు రావాలన్నారు. అన్ని రాష్ట్రాల సైకిలిస్ట్ లు కూడా ఈ విధంగానే సైక్లింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇప్పటినుండే సైక్లింగ్ లో ఆసక్తి ఉన్న వారు ముందుకొచ్చి సైక్లిస్ట్ గ్రూపులో భాగస్వాములు కావాలని, ఇందులో నేర్చుకొని అనుభవం పొందితే దేశం తరఫున కూడా నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు తోడ్పడుతుందన్నారు. దేశంలోనే హైదరాబాద్ ను సైక్లింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా నిలపాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకొని.. ఆత్మవిశ్వాసంతో సైకిలిస్ట్ లు నిర్విరామంగా 13 రాష్ట్రాల మీదుగా కే 2 కే సైకిల్ రైడ్ ను చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై.శ్రీనివాసరావు, అంకుర్ రావత్, శ్రీనివాస్ రామరాజు, బల్ రామ్ ఆర్య, హ్రితిక్ మెల్వని, జయంత్ జునేజ, అభిమన్యు, లక్ష్మీ శ్రీ, పూర్వి తాకుర్, పి.సాయిరామ్ మరియు భీమ్ సింగ్ నాయక్, ప్రసాద్ టేకుమల్ల, టెక్నీషియన్ రాకేష్ మర్రి, డ్రైవర్స్ సుకూన్, సందీప్ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..