సిరిధాన్యాలతో ఓ యువకుడు టిఫిన్ సెంటర్ ని పెట్టాడు..అది కూడా తోపుడు బండి ద్వారా తాను తయారు చేస్తున్న టేస్టీ ఇడ్లీలని జనానికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. రాగి, ఇతర సిరిధాన్యాలతో వండిన ఇడ్లీలను టేస్ట్ చేశారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దాంతో చిట్టెం సుధీర్ ని మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువత ఇలాంటి ఆహారం తీసుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. అంతేకాదు ఈరోజు ఉదయం ‘వాసెనపోలి’ వారి రాగి, జొన్న, ఇతర సిరిధాన్యాలతో చేసిన అల్పాహారాన్ని ఆరగించాను.
చాలా రుచిగా అనిపించాయి. ఆరోగ్యాన్నిచ్చే ఇలాంటి ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు..సిరిధాన్యాలతో సాంప్రదాయ పద్ధతిలో ఇలాంటి మంచి టిఫిన్ ను అందిస్తున్న విశాఖపట్నం యువకుడు చిట్టెం సుధీర్ కు అభినందనలు. వినూత్న ఆలోచనలతో మన సంప్రదాయ ఆహారపద్ధతులను కాపాడుకునేందుకు యువత చొరవ తీసుకోవా వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. దాంతో చిట్టెం సుధీర్ టిఫిన్స్ ఫేమస్ అయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..