Friday, November 22, 2024

చిరంజీవి ఆస్తుల విలువ.. ఎంతో తెలుసా..

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయస్సు వచ్చినప్పటికీ ఎంతో హుషారుగా అంతే ఎనర్జిటిక్ తో డాన్స్ చేయడంతో విపరీతమైన యూత్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఆయన కేవలం సినిమాలలో మాత్రమే నటించడం కాదు.. పలు వాణిజ్య ప్రకటనలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు కొన్ని షోలకు హోస్ట్ గా కూడా పని చేశాడు. చిరంజీవి సొంత బిజినెస్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల ద్వారా కూడా బాగానే సంపాదించార‌నేది సమాచారం. ఇక చిరంజీవి ఇంటి విషయానికి వస్తే ఇంద్రభవనాన్ని తలపిస్తుంది అని, ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో ఏ హీరో ఇల్లు కూడా ఆ రేంజ్ లో లేదని చెబుతారు.న‌టుడు నాగార్జున సలహా మేరకు బిజినెస్ లో అడుగుపెట్టాక చిరంజీవి జాతకం మారిపోయింది..మా టీవీ లో షేర్ తీసుకోవడం , ఆ తర్వాత అపోలో లో రామ్ చరణ్ భాగస్వామ్యం కావడం ,అలాగే చరణ్ ట్రూ జెట్ పేరుతో ఫ్లైట్ కంపెనీ పెట్టడం ఇలా అన్ని కలిసి వచ్చి, ఇప్పుడు చిరంజీవి కుటుంబ ఆస్తుల విలువ దాదాపు 500 కోట్లకు చేరుకుందని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement