Sunday, September 22, 2024

మేడే పోస్టర్ ఆవిష్కరణ…

ఇటిక్యాల : ఏప్రిల్ 24 ప్రభా న్యూస్ మండలపరిధిలో ఏఐటీయూసీ నాయకులు కార్మికులతో కలిసి 135వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే పోస్టర్లును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎఐటియుసి నాయకులు కృష్ణ మాట్లాడుతూ అమెరికా చికాగో నగరంలో 1986 మే 1న ఎనిమిది గంటల పని దినం కోసం వేలాదిమంది కార్మిక ఆపరేటర్లు పోరాటం చేయడంతో అమెరికా ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రపంచలోని అన్ని దేశాల్లో కూడా కార్మిక ఉద్యమాలు చేయగా కార్మికుల హక్కుల కోసం చట్టాలు రూపకల్పన చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మే 1న కార్మికులకు అందరు వారి పండులగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలోఏఐటీయూసీ నాయకులు ఆశన్న.. చెన్నయ్య.. సత్య రాజు ..వెంకన్న.. వెంకటయ్య.. ఆంజనేయులు.. శీను.. నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement