కరోనా ముప్పు ఇంకా తగ్గలేదు..థర్డ్ వేవ్ కూడా రానుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే పలువురు కరోనా జాగ్రత్తల్లో అశ్రద్దని వహిస్తున్నారు. మాస్క్ లు పెట్టుకునే వారి సంఖ్య తగ్గుతోంది. అందుకే బిగ్ బాస్5 వెరైటీ కాన్ సెప్ట్ ని ఎంచుకుంది. హైదరాబాద్ మెట్రో రైలులో మాస్క్ తీసి మాట్లాడేవారిపై ‘బిగ్‌బాస్’ ఓ కన్నేసి ఉంచిన విషయాన్ని మర్చిపోవద్దంటూ మెట్రో అధికారులు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. బిగ్‌బాస్ వ్యాఖ్యాత నాగార్జున, ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రయాణికుల భద్రతపై మరింత అవగాహన కల్పించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని నాగార్జున తెలిపారు. కరోనాపై అవగాహన, సురక్షిత ప్రయాణ పద్ధతులపై అవగాహన పెంపొందించడం, మొబైల్ క్యూఆర్ కోడ్ టికెట్లు, స్మార్ట్ కార్డుల వినియోగంపై అవగాహన పెంపొందించడమే ఈ ప్రచారం లక్ష్యమని కేవీబీ రెడ్డి పేర్కొన్నారు.. ఈ మేరకు స్టార్ మాతో కలిసి ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లోని బిగ్‌బాస్ సెట్‌లో ‘బిగ్‌బాస్ మిమ్మల్ని గమనిస్తున్నాడు’ అనే ప్రచారాన్ని ప్రారంభించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement