కవాడిగూడ : ప్రజలు ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్‌లో అధిక శాతం మహిళా కార్పొరేటర్లు ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యుల పెత్తనం వల్ల మహిళా కార్పొరేటర్లు ప్రజల్లో మమేకం కాలేకపోతున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మరికోందరైతే పర్యటనలకే పరిమితమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కార్పొరేషన్ ఎన్నికలు జరిగి దాదాపు దాదాపు 2 నెలలు దాటినప్పటికీ అడిక్‌మెట్ డివిజన్ కార్పొరేటర్ పర్యటనలకే పరిమితమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కార్పొరేటర్‌కు పరిపాలన, ప్రజల సమస్యలపై అనుభవం ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించలేకపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడపా దడపా అధికారిక కార్యక్రమాలలో తప్ప మరెక్కడా కార్పొరేటర్ కనిపించిన దాఖలాలు లేవు. కార్పోరేటర్ కార్యాలయంలో ఎప్పుడు చూసినా ఆమె భర్త సి ప్రకాష్‌గౌడ్ దర్శనమిస్తారు. కార్పోరేటర్ సి సుని త ఏ ఒక్క నాడు ప్రజలకు అందుబాటులో ఉన్న సందర్భాలు సైతం కనిపించలేదు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు మున్సిపల్ డివిజన్లలో ఆయా డివిజన్‌ల కార్పోరేటర్‌లు సమస్యల పరి ష్కారంలో దూసుకుపోతుంటే ఆడిక్‌మెట్ డివిజన్‌లో కార్పోరేట ర్ మాత్రం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపిస్తున్నారు. గతంలో కార్పోరేటర్‌గా పనిచేసిన కాలంలో చాల సందర్భాలలో ప్రజలు కార్పోరేటర్‌ను నిలదీసిన సంఘటనలు ఉన్నాయి. అధికారిక కార్యక్రమాలలో తప్ప ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. బిజెపికి పట్టం కడితే తమ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని ప్రజలు ఎంత ధీమాతో ఓట్లు వేసి గెలిపిస్తే కనీసం పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ప్రతి కార్పొరేటర్ తమ తమ కార్యాలయాలలో ఏదో ఒక సమయంలో అందుబాటులో ఉంటుండగా సునిత మాత్రం ఎక్కడా కనిపించదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా కార్పోరేటర్ ప్రజలకు అందుబాటులో ఉంటే వారి వారి సమస్యలను విన్నవించుకునే అవకాశం ఉంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పజలకు నిత్యం అందుబాటులో ఉండాలని పార్టీ అధిష్టానం ఇటీవల జరిగిన సమావేశంలో సూచించినప్పటికీ పార్టీ ఆదేశాలు పట్టుంచుకోకపోవడం వి శేషం. ఇప్పటికైనా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండాలని డివిజన్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement