కాన్వాస్ అద్భుత చిత్రాలకు ఆకాశం వేదిక. తాజా అద్భుతం విషయానికి వస్తే అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం ‘నాసా’ ఒక చిత్రాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. నాసా వారి ‘చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ’ కాప్చర్ చేసిన ఈ ఫోటోలో అంతరిక్షంలో క్రిస్‌మస్ ట్రీ కనువిందు చేస్తోంది.
భూమికి 2,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర సమూహం తాలూకు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కాంతి క్రిస్మన్ టీ ఆకారంలో దర్శనమిస్తోంది. పాలపుంత లోపల ఉన్న ఈ నక్షత్ర సమూహాన్ని ‘ఎన్‌జీసీ 2264’ అని పిలుస్తారు. సహజసిద్దంగా పలు నక్షత్రాలు ఈ విధఃగా క్రిస్మస్ ట్రీ ఆకారంలో కనిపించడం అకాశఃలో అద్భుతం అంటున్నారు శాస్త్రవేత్తలు.