Tuesday, November 26, 2024

గ్రంధాలయాలను ప్రతి విద్యార్ధి సద్వినియోగం చేసుకోవాలి

ఉలవపాడు , : ఉలవపాడు శాఖా గ్రంధాలయంలో నిర్వహించిన చదవడం మాకిష్టం అనే కార్యక్రమంలో మొత్తం 43 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. ముందుగా వీరితో నీతి కధలు చదివించి తరువాత స్కిప్పింగ్‌ పోటీని నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విజేతలు మొత్తం 17 మంది విద్యార్ధులకు దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డి జ్ఞాపకార్ధం వారి కుమార్తె కోటిరెడ్డి సుచరితా రెడ్డి బహుమతులు అందించారు. వారికి గ్రంధ పాలకుడు దాసరి కోటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను గ్రంధాలయానిక పంపించే అలవాటు చేయాలని, దీనితో వారికి మంచి విజ్ఞానం వస్తుందని అన్నారు. గ్రంధాలయాలను ఉపయోగించుకొని ప్రతి విద్యార్ధి ఉన్నత శి ఖరాలను అధిరోహించవచ్చునని ఆయన సూచించారు. గ్రంధాలయానికి విద్యార్ధులను పంపిన తల్లిదండ్రులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement