Friday, November 22, 2024

కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి మృతి

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేల మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నారాయణరాజు(62) మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఢిల్లీలోని డీఆర్‌డీవో ఫెసిలిటీలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నారాయణరాజు కొంతకాలంగా న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవలే కేంద్రం ఆయన పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement