బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ జరిగింది. కాగా లాలు ప్రసాద్ యాదవ్‌కి సింగపూర్‌లోని ఓ హాస్పిటల్‌లో కిడ్నీ మార్పిడీ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని బిహార్ డిప్యూటీ సీఎం, లాలు ప్రసాద్ యాదవ్ చిన్న కొడుకు తేజస్వీ యాదవ్ తెలిపారు. తన తండ్రి, సోదరి ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ట్వీట్ చేశారు. లాలు ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ దానం చేయడానికి ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య ముందుకు వచ్చారు. ఆమె రెండు కిడ్నీలలో ఒకదాన్ని తండ్రి లాలు ప్రసాద్ యాదవ్‌కు ట్రాన్స్‌ప్లాట్ చేశారు.
రోహిణి ఆచార్య ఇందుకు సంబంధించి సర్జీరికి ముందు ఓ ఫొటో ట్వీట్ చేశారు. రాక్ అండ్ రోల్‌కు తాను సిద్ధంగా ఉన్నారని రోహిణీ ఆచార్య తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్టు చేశారు. తనకు విష్ చేయాలని పేర్కొన్నారు. సర్జరీ కంటే ముందే ఆమె బెడ్ పై తన ఫొటోను, అలాగే, తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్‌లో ఆ తర్వాతి పరిణామాన్ని లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురు, రాజ్యసభ ఎంపీ మీసా భారతి ట్వీట్ చేశారు. డోనర్ రోహిణీ సింగ్ ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఇప్పుడు తన తండ్రికి ఆపరేషన్ జరుగుతున్నదని అనంతరం ట్వీట్ చేశారు. తన చెల్లి రోహిణి ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఆమెను ఇప్పుడు ఐసీయూలో ఉంచారని వివరించారు.