కర్నూలు – రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది ప్రధాన బాద్యతగా తీసుకొందని అందుకు అధికారులు అందరూ బాధ్యతగా తీసుకొని పని చేయాలని..ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదని జిల్లా కలెక్టర్ జీ వీరపాండియన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు గ్రౌండింగ్ హౌసింగ్ ప్రోగ్రాం పనుల పురోగతి పై స్పెషల్ ఆఫీసర్, హౌసింగ్ ఈఈలు, డిఈలు, ఏఈలతో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, హౌసింగ్ పిడి వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సిహెచ్ విద్యాసాగర్, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ ఈ కే.శివప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు.ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీలు చేపడుతున్న ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్, జాబ్ కార్డ్ మ్యాపింగ్ సంబంధించిన పనులన్నీ ఈ నెల ఏడో తేదీ లోపు వంద శాతం పూర్తి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏప్రిల్ పదో తేదీ లోపు జగనన్న కాలనీలకు సంబంధించి వాటర్ సప్లై, పవర్ సప్లై యుద్ధ ప్రాతిపదికన కల్పించాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ లు చాలా సీరియస్ గా తీసుకొని వంద శాతం జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు గాను వాటర్ సప్లై, పవర్ సప్లై కల్పించాలని ఆదేశించారు. అన్ని లేఅవుట్లలో ఈ నెల 10వ తేదీలోగా మోడల్ హౌస్ నిర్మించాలన్నారు. అదే విధంగా హౌసింగ్ గ్రౌండింగ్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వంద శాతం పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయం చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను అధిగమించలన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఏ మాత్రం అలసత్వం వహించకూడదని అలా జరిగితే సహించేదే లేదన్నారు. అంతకుముందు మండలాల వారీగా హోసింగ్ ప్రోగ్రాం పై రివ్యూ నిర్వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement