Tuesday, December 24, 2024

KTR Twit – ఆయన సోకులకేం తక్కువ లేదు

ఆంధ్రప్రభ స్మార్ట్, హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వైఖరి మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలి అన్నట్లు ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. ఈ మేరకు సీఎం రేవంత్పై ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అప్పుల పాలైందని, డబ్బులు లేవని తెల్లారిలేస్తే బీద అరుపులు అరుస్తున్నారని మండిపడ్డారు.

మరొకవైపు మూసీ పేరిట లక్షా యాభై వేల కోట్ల రూపాయల సోకులు, ఆర్భాటం ఎవరికోసమని ప్రశ్నించారు. రైతు రుణమాఫీకి డబ్బులు లేవు, రైతుబంధుకు డబ్బులు లేవని విమర్శించారు. రైతు కూలీలకు డబ్బులు లేవు, కౌలు రైతులకు డబ్బులు లేవన్న ఆయన, నిరుద్యోగ భృతికి డబ్బులు లేవని, పేదవాళ్లకు పెన్షన్లకు డబ్బులు లేవని పేర్కొన్నారు.ఒక్క పథకం అమలు చేయని కాంగ్రెస్రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి ప‌ది నెల‌లు అవుతున్నా.. ఒక్క సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కం అమ‌లుకు నోచుకోలేదు.

- Advertisement -

రేవంత్ రెడ్డి ప‌రిపాల‌న ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న చందంగా త‌యారైంది. ఏ ఒక్క వ‌ర్గానికి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సంక్షేమ ప‌థ‌కం అంద‌లేదు. ఈ క్ర‌మంలో రేవంత్ స‌ర్కార్‌పై రాష్ట్ర ప్ర‌జానీకం తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement