ములుగు,ప్రభ న్యూస్ః మహబూబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్లలో వెలసిన దేవుడు పగిడిద్దరాజు. అటవీ మార్గం ద్వారా కోయ పూజారులు పగిడిద్దరాజును తీసుకొని మేడారం బయలుదేరారు మంగళవారం సాయంత్రానికి గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి గ్రామం లో బస చేసి బుధవారం ఉదయం పస్రా చేరుకున్నారు. 80 కిలోమీటర్ల మేర కాలినడకన దట్టమైన అడవి ప్రాంతాల నుంచి మరికొన్ని గంటల్లో మేడారం గద్దెలపైకి పగిడిద్దరాజు చేరుకోనున్నారు.
క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ పర్యవేక్షస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్
మేడారం జాతర తరలివస్తున్న వాహనాలను క్రమబద్ది కరించడంతో పాటు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ సిబ్బందితో కల్సి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యవేక్షణలో భాగంగా పసరా నుండి మేడారం వెళ్లే మార్గంలో వాహనాలు ముందుకు సాగేందుకు పోలీస్ కమిషనర్ సంబంధిత సెక్టార్ అధికారులకు పలు సూచనలు చేస్తూ ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ముందుకు కొనసాగుతున్నారు.