Tuesday, November 26, 2024

Khammam -‘ రైతు గోస – బీజేపీ భరోసా ‘ కు సర్వం సిద్దం – అమిత్ షా రాకకు వెయిటింగ్

ఖమ్మంలో నేడు జరిపే బహిరంగ సభతో బీజేపీ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగుతుంది. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కంటే.. ఖమ్మంలో యాక్టివ్ పాలిటిక్స్ ఎక్కువగా కొనసాగుతాయి. ఇక్కడ, రాజకీయ ఎత్తుగడలూ ఎక్కువే.. అక్కడ ఇది వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్.. మార్చ్ సభ నిర్వహించారు. అది బాగానే సక్సెస్ అయ్యింది. దీంతో మళ్లీ బీజేపీలో ఉత్సాహం పెంచాలనుకుంటున్నారు.. ఈ సందర్భంగా ఓ 22 మంది నేతలు బీజేపీలో చేరతారని కమలం పార్టీ నేతలు అంటున్నారు.

ఈ బహిరంగ సభకు రైతు గోస – బీజేపీ భరోసా అని పేరు పెట్టారు. తెలంగాణలో ప్రస్తుతం రైతులకు ధరణి సమస్య ఉంది.. చాలా మంది రైతులు ధరణిలో తమ భూముల రిజిస్ట్రేషన్, ఇతరత్రా అంశాలతో ఇబ్బంది పడుతున్నారనే అంశాన్ని ఇది వరకు బీజేపీ పార్టీ హైలెట్ చేసింది. దాంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి.. ధరణిలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. మొత్తంగా ధరణి విషయంలో రైతులకు ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకొని.. రైతులకు అండగా నిలవాలని బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తున్నాయి.

.

అయితే, ఇవాళ్టి సభను వర్షం పడినా ఇబ్బంది లేకుండా సభ ప్రాంగణం సెట్ చేశారు. లక్ష మంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఖమ్మం సిటీలోని ఇల్లందు రోడ్డు – బైపాస్ రోడ్డు వెంట.. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం గన్నవరం చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఖమ్మం బహిరంగ సభకు వస్తారు అని బీజేపీ రాష్ట్ర పార్టీ నేతలు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement