Friday, November 22, 2024

నేటి నుండి వచ్చే నెల23వరకు కార్తీక ఉత్సవాలు..సర్వాంగ సుందరంగా ముస్తాబయిన శ్రీశైలం దేవస్థానం

కార్తీక మాసోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం. నేటి నుంచి వచ్చే నెల 23 వరకు కార్తీక ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామివారి దర్శన వేళల్లో మార్పులు చేశారు. ప్రధాన ఆలయ ద్వారాలు ఉదయం 3.30 గంటలకు తెరువనున్నారు. తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి వారిని భక్తులు దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. శని, ఆది, సోమవారాలు, పర్వదినాల్లో స్వామివారి అలంకార దర్శన భాగ్యం కల్పిస్తామని, బుధవారం నుంచి శుక్రవారం వరకు స్పర్శ దర్శనం ఉంటుందని వెల్లడించారు. స్వామి వారి సన్నిధిలోని నాగులకట్ట ప్రాంగణం వద్ద ఈ ఏడాది భక్తులు దీపారాధనలు చేయడాన్ని అధికారులు రద్దుచేశారు. ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద ఉత్తర మాడ వీధిలో భక్తులు దీపారాధనలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement