Wednesday, November 20, 2024

కలియుగాది భారత చరిత్ర

భారతం నాటిది మగధ సామ్రాజ్యం. జన మేజయుని తర్వాత కురు వంశానికి ప్రాధాన్యత పోయి మగధ, దేశానికి మొత్తం రాజధాని అయిం ది. అప్పటి నుంచి విక్రమార్కుని వరకూ మగధ సింహాసనాన్నెక్కినవాడే చక్రవర్తి. జరాసంధుని వంశం వారు జనమేజయుని తర్వాత ప్రాభవంలో కి వచ్చి చక్రవర్తులయ్యారు. జరాసంధుని కొడుకు భగదత్తుడు. ఇతడు భారతయుద్ధంలో మరణించా డు. ఆయన కొడుకు స#హదేవుడు. ఆయ న కొడుకు సోమాధి. వారిలో చివరివాడైన రిపుంజయుని వధించి అతని మంత్రి కొడుకు ప్రద్యోతుడు చక్రవర్తి అయ్యాడు. ఈ ప్రద్యోతుని కుమార్తె పద్మావతే ‘స్వప్న వాసవదత్త’, నాయకుడు, విధ్యాధరాధిపతి అయిన ఉదయన మహారాజు రెండవ భార్య. (ఉద యనుడు జనయ మేజయుని సంతతి, #హస్తిన పాల కుడు). అలా ప్రద్యోత వంశం మొదలైంది. వారిలో చివరి వాడైన నందివర్ధనుని సం#హరించి కాశీరాజై న శిశునాగుడు మగధ సింహాసనాన్నెక్కాడు. అది శిశునాగవంశం. అప్పటి వరకూ క్షత్రియులే పాల కులు. వీరిలో ఐదవవాడైన బింబిసారుడు. గౌతమ బుద్ధుని సమకాలీనుడు. అతని కొడుకు అజాతశత్రు వు కాలంలో బుద్ధుడు నిర్యాణం చెందాడు. శిశునా గులలో చివరివాడు మహానంది. ఇతనికి శూద్రకాం త యందు జన్మించినవాడు నందుడు. ఇతనినే మహాపద్మనందుడనీ అంటారు.
ఈ నందుడు రాక్షస మంత్రి సహాయంతో తండ్రిని ఎదిరించి రాజ్యాన్ని #హస్తగతం చేసుకున్నా డు. ఆయనకు ఎనిమిది మంది క్షత్రియకాంతలు భార్యలు. వీరి ఎనిమిదిమంది పుత్రులనీ, మహా పద్మనందుణ్ణీ కలిపి నవనందులంటారు. వీరిలో పెద్దవాడైన సుమాల్యుడు, చాణక్యుడని పిలవబడే విష్ణుగుప్తుడనే బ్రా#హ్మణ్ణి అవమానిస్తారు. ఆ చాణ క్యుడు నవనందుల్ని నిర్మూలిస్తానని శపథం చేస్తా డు. మహాపద్మ నందుడికి ‘ముర’ అనే శూద్రకాంత మరొక భార్య. ఆమె కొడుకే మౌర్య చంద్రగుప్తుడు. చాణక్యుడు ఈ చంద్రగుప్తుణ్ణి దగ్గరకు తీసి, నవనం దుల్నీ తన కుటిలనీతితో సం#హ రించి చంద్రగుప్తుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాడు. అంటే మౌర్యులు శూద్రు లు. ఆ మౌర్య చంద్రగుప్తుని కొడు కే బింబిసారుడు. ఇతడు బౌద్ధమతానుయాయి. ఇతని కొడుకే అశో కుడు, బౌద్ధానికి విస్తృత ప్రచారాన్ని కల్పించినవా డు. ఈ మౌర్యులలో చివరివాడైన బృ#హద్రథుని సం#హరించి అతని సేనాని, బ్రా#హ్మణుడు అయిన పుష్యమిత్రుడు రాజైనాడు. ఆయన తరువాత అశ్వ మేధయాగం చేశాడు.
పుష్యమిత్ర వంశంలో చివరివాడైన దేవభూ తిని సం#హరించి ఆయన సేనాని కాణ్వాయనుడైన వాసుదేవుడు చక్రవర్తి అయ్యాడు. వీరూ బ్రా#హ్మ ణులే. కాణ్వాయనులలో చివరివాడైన సుశర్మని వధించి ఆంధ్రుడు, శాతవా#హన వంశస్థుడు, బ్రా #హ్మణుడు ఐన శ్రీముఖ శాతకర్ణి మగధ సింహాసనా న్నెక్కాడు. ఆంధ్రులు అప్రతి#హతంగా వందలయే ళ్ళు మగధని పాలించారు. ప్రసిద్ధుడైన గౌతమీ పుత్ర శాతకర్ణి ఈ వంశంలో వాడే. వాళ్ళు మన ఆంధ్ర ప్రాకృతాన్ని రాజభాషగా చేశారు. వీరిలో చివరి వాడైన చంద్రశ్రీని వధించి గుప్తచంద్రగుప్తుడు రాజ య్యాడు. వీరు క్షత్రియులు. ఈ గుప్తచంద్రగుప్తుడి కొడుకే ప్రసిద్ధుడైన సముద్రగుప్తుడు. విక్రమార్కు డు ఉజ్జయిని రాజధానిగా, సమస్త భారతావనినీ జయించి చక్రవర్తి అయి శకకర్తగా వేదధర్మాన్ని స్థాపించాడు. ఆయన మనుమడు శాలివా#హనుడు, మనం ఇప్పుడు ఆ శాలివా#హన శకం 1933లో ఉన్నాం. అదీ కలియుగాది భారతదేశ చరిత్ర.

Advertisement

తాజా వార్తలు

Advertisement