Sunday, November 24, 2024

Judgement Day : గ్రూప్-1 హైకోర్టు తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ

హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-1 పరీక్షను రద్దు చేశారు.పరీక్షల నిర్వహణ సమయంలో టీజీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా తమ భవిష్యత్ అంధకారంలో పడుతుందని పలువురు కోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి హైకోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. పరీక్షలో 7 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, పరీక్ష రద్దు చేయాలని పది మందికి పైగా అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

- Advertisement -

.

అయితే, పరీక్ష రద్దుకే హైకోర్టు మొగ్గుచూపుతుందా? లేదా పిటిషన్లను కొట్టివేస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువడనుంది. ఈ నెల 21 నుంచి అనగా మరో 6 రోజుల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు కీలకంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement