Tuesday, November 26, 2024

విద్యార్థుల కోసం జాబ్ మేళా..

కందుకూరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు కందుకూరు పట్టణంలోని శ్రీ గాయత్రి డిగ్రీ కాలేజ్‌ వారి సంయుక్త ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ జాబ్‌ మేళాకి అమరరాజ గ్రూప్‌, హెట్రో డ్రగ్స్‌ ఇన్నోవా సోర్స్‌, శ్రీసిటీ స్మార్ట్‌ మొబైల్‌ కంపెనీలు హజరు అయ్యారు. మొత్తం 57 మంది హాజరుకాగా ఇందులో 23 మంది సెలక్ట్‌ అయ్యారు. వారిలో 11 మంది షార్ట్‌లిస్టు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గాయత్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ రామకృష్ణ, కాలేజీ ప్రిన్సిపాల్‌ గీతా శ్రీనివాస్‌ ..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్లేస్మెర్‌ ఎగ్జిక్యూటివ్‌ షేక్‌ బాషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కళాశాల కరస్పాండెంట్‌ రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ యువత కొరకు చేసే మంచి కార్యక్రమాలను కొనియాడారు. ఇటువంటి జాబ్‌ మేళా ద్వారా యువతకు ఎంతో కొంత మేలు చేకూరుతుందని తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. అనంతరం జాబ్‌ మేళాకు హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు వారి యొక్క కంపెనీల గురించి తెలియజేశారు. ఈ కార ్యక్రమమునకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కందుకూరు స్కిల్‌ అధికారి బి.శ్రీనివాస్‌, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement