Friday, November 22, 2024

Jharkhand Exit Poll : ఝార్ఖండ్ లో బిజెపి కూటమిదే అధికారం

ఝార్ఖండ్ ఆసెంబ్లీ ఎన్నికలు 2024 ఫలితాలపై సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. అయితే మొత్తం 81 శాసనసభ స్థానాలకు రెండు విడతలుగా పోలింగ్ జరిగింది.

ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా 41 సీట్లు గెలవాలి. మ్యాజిక్ ఫిగర్ 41 వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది..

81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి, ఎన్డీయే మధ్య హోరాహోరీ పోరు సాగినా అంతిమంగా ఎన్డీయేకే గెలుపు అవకాశాలున్నట్లు మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది.

జార్ఖండ్ అసెంబ్లీలోని 81 సీట్లలో అధికారం కోసం ఏ పార్టీకైన 41 సీట్లు రావాలి. అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ఎన్డీయే కూటమికి 42 నుంచి 47 సీట్లు లభించబోతున్నట్లు ఏబీపీ ఎగ్జిట్ పోల్ తేల్చింది.

- Advertisement -

అటు అధికార ఇండియా కూటమికి 25 నుంచి 30 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇతరులకు మరో 1 నుంచి 4 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

దీంతో ప్రభుత్వ ఏర్పాటు కీలకంగా మారబోతోంది.గిరిజన రాష్ట్రమైన జార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు అధికార మార్పుకు ఓటేశారని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఏబీపీ మ్యాట్రిజ్ తో పాటు పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా ఇక్కడ విపక్ష బీజేపీ అధికారం చేపట్టబోతోందని అంచనా వేశాయి. దీంతో హేమంత్ సోరెన్ సర్కార్ అవినీతి మరకలు ఇండియా కూటమిని ముంచేసినట్లు తెలుస్తోంది.

పీపుల్స్ పల్స్:NDA-45-56,JMM:24-37, ఇతరులు:6-10

చాణక్య:NDA:45-50, JMM:35-38

Advertisement

తాజా వార్తలు

Advertisement