Tuesday, November 26, 2024

తక్షణమే టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయండి: జనసేన

ఏపీలో తక్షణమే పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభించి లక్షల బాధపడుతున్న విపత్కర సమయంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలనే మొండి వైఖరితో సీఎం జగన్.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేశారని మండిపడ్డారు. ఈ వైఖరిని నిరసిస్తూ జనసేన పార్టీ వీర మహిళ విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచన మేరకు కోవిడ్ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ వీర మహిళ విభాగం ఇళ్లలోనే దీక్షలు చేస్తున్నారు. కరోనా సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న సమయంలో పది,  ఇంటర్ పరీక్షల నిర్వహణ సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వమే సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసిందని చెప్పారు. ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై మరోసారి పునరాలోచన చేయాలని తెలిపారు.  ప్రభుత్వం పరీక్షలపై వెనక్కి తగ్గక పోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమిస్తామని  జనసేన వీర మహిళ విభాగం నేతలు హెచ్చరించారు. కరోనా నియంత్రణ చర్యల్లో తీవ్రంగా విఫలమై.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయలేక వాటిని నిలిపివేసిన ప్రభుత్వం… విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు. చేతకాక కరోనా పరీక్షలు నిలిపివేసి విద్యార్థులకు మాత్రం పరీక్షలు పెట్టడం జగన్ రెడ్డి ప్రభుత్వ ముర్ఖత్వాన్ని తెలియజేస్తోందని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement