Saturday, November 23, 2024

జ‌న జాగ‌ర‌ణ పేరుతో కాంగ్రెస్ పాద‌యాత్ర‌..2023ఎన్నిక‌ల్లో గెలుపు మాదే..మాణిక్యం ఠాగూర్..

కాంగ్రెస్ పార్టీ మాంచి దూకుడుమీదుంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా బాద్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి పార్టీలో కొత్త ఉత్సాహం వ‌చ్చింది. కొంత‌మంది అసంతృప్తిని వ్య‌క్తం చేసినా పార్టీ ముందుకు దూసుకువెళ్తోంది. కాగా పార్టీలోని ప‌లువురు నేత‌ల‌కు అధిష్టానం కీల‌క ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెడుతూ క్యాడ‌ర్ లో కొత్త ఊపుని తీసుకొస్తున్నారు. ఇది ఇలా ఉండ‌గా నవంబర్ 1 వ తేదీ నుంచి డిజిటల్ మెంబర్ షిప్ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గాంధీ భవన్ నుంచే రేపు ఉదయం ప్రారంభం కానుంద‌ని వెల్ల‌డించారు.

మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ, మరియు మండల అధ్యక్షుల సమావేశం జ‌రిగింది. ఈ సమావేశం లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న దోపిడీ, అరాచకాల పై నవంబర్ 14 వ తేదీ నుంచి 21 వరకు 7 రోజుల పాటు నారాయణ పేటలో జన జాగరణ పేరు తో పాదయాత్ర చేస్తామ‌ని ప్రకటించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 78 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం లో టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు, అక్రమ కేసులపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement