Saturday, November 9, 2024

జాగృతి ప్రవర్తన, పరివర్తన కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ కార్తికేయ మిశ్రా..

పశ్చిమగోదావరి : జిల్లా చింతలపూడి పట్టణంలో జంగారెడ్డిగూడెం డిఎస్పి రవికిరణ్ అధ్యక్షతన జాగృతి ప్రవర్తన, పరివర్తన అనే కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ.. నాటు సారా తయారీ, వాడకం వల్ల కలిగే నష్టాలను, పోలీస్ కేసులు వల్ల, శిక్షణ వల్ల జీవితంలో ఎక్కువ సమయం జైలులో గడపటంతో, కుటుంబంతో, మానవ సంబంధాలతో, తయారీదారులు దూరంగా గడపాల్సి వస్తుందని, అటువంటి నేరాలకు పాల్పడకుండా మంచి జీవితాన్ని గడపాలని తెలిపారు.

అనంత‌రం ..ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ జీవితంలో మంచిగా బ్రతకటానికి, సన్మార్గంలో జీవించటానికి ప్రతి మనిషి అలవాటు చేసుకోవాలని, నేరాలకు పాల్పడి, మంచి జీవితాలను కోల్పోవద్దని, జైలుకు వెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఎమ్మార్వో ప్రమద్వర, ఎం డి ఓ రాజ్ మనోజ్, ఎస్ ఐ స్వామి, నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement