కర్నూలు – రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలు , ఓర్వకల్లు వినాశ్రయం ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప బుధవారం వెల్లడించారు. ముఖ్యమంత్రి కర్నూలు పర్యటన సంధర్బంగా ఓర్వకల్లు విమానాశ్రయం సరిహద్దు, పరిసర ప్రాంతాలలో బందోబస్తు నిర్వహించే స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ బందోబస్తు వివరాలను వెల్లడించారు. బందోబస్తు విధుల్లో 7 మంది డిఎస్పీలు, 17 మంది సిఐలు, 44 మంది ఎస్సైలు, 105 మంది ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుళ్ళు, 303 మంది కానిస్టేబుళ్ళు, 39 మంది మహిళా పోలీసులు, 150 మంది హోంగార్డులు, 2 ప్లటూన్ల ఏ ఆర్ పోలీసులు , 6 స్పెషల్ పార్టీ బృందాలు ఉంటాయన్నారు. జిల్లా ఎస్పీ వెంట ఇంటెలిజెన్స్ ఎస్పీ రమేష్ రెడ్డి, సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి ఐపియస్ , ఎఆర్ అడిషనల్ ఎస్పీ రాధాక్రిష్ణ, డిఎస్పీలు మహేశ్వరరెడ్డి, కె.వి మహేష్, రాజీవ్ కుమార్, వినోద్ కుమార్, శ్రీమతి శృతి, మహాబూబ్ భాషా, ఇలియాజ్ భాషా, సిఐలు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement