సాక్షాత్తు పరమేశ్వరావతారమైన శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యులు వారు భారతీయ సనాతన ధర్మాన్ని, ధర్మ మార్గాలను, భక్తితత్త్వా న్ని, ఆచార వ్యవహారాలను ప్రజలలో విశ్వాసం కలిగించడానికి, భారత దేశంలో నాల్గు మూలలా నాలుగు పీఠాలు స్థాపించిన సంగతి మనకు తెలిసిందే. దక్షిణాన శృంగేరిలో నెలకొల్పిన శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి దేశ సంచారము చేస్తూ భక్తులను ఉద్దేశించి ”ఉపదేశామృతం” అందిస్తుంటారు. స్వా మి చెప్పే ఉపదేశం అమృతం లాంటిదే. అమృతం అంటే మధురం.
మనలో చైతన్యం తీసుకొచ్చేది. మనకు జీవన వికాసం కలిగిం చేది. అందుకే స్వామి చెప్పిన ఉపదేశాలను విని, మనం జాగృతమవు దాము. స్వామి అనేక అంశాలు మీద ఉపన్యాసం అందించారు. వాటిలో ‘పాప పుణ్యాలు’, ‘శ్రద్ధ’ అనే అంశాలపై సూక్ష్మంగా తెలుసు కొందాం.
‘పాపపుణ్యాలు’ మానవులు సహజంగానే సుఖం కావాలనే కోరు కొంటారు. ఎవరూ దు:ఖాన్ని కోరుకోరు కదా. మనం అనుభవించే సుఖం, దు:ఖం మనం పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల ఫలి తంగానే లభిస్తాయని మన శాస్త్రాలు, వేదాలు చెపుతున్నాయి. దు:ఖాన్ని కోరు కోకపోయినా, బుద్ధి పూర్వకంగా దు:ఖ జనకాలైన పాపకృత్యాలనే ఆచ రిస్తూంటారు. శ్రీ కృష్ణ పరమాత్మ ”తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యా కార్య వ్యవస్థితౌ” ఏ పనులు చేయవచ్చు, ఏమి చేయకూడదు అనే వివే కాన్ని మనం అలవరచుకోవాలి. మనకు మనమే ఏది మంచో? ఏది చెడో నిర్ణయించుకోవాలి. అలా కానప్పుడు జీవితం గందరగోళంలో చిక్కు కొంటుంది. ఎందుకంటే ఎవరి తర్కం వారిది. అందరికీ ఆమోదయోగ్య మైన ఒక ప్ర మాణం కావాలి. అటువంటి ఆధారం మన శాస్త్రాలు. అవి ఏది ధర్మమో? ఏది అధర్మమో? విశిదపరుస్తున్నాయి. శాస్త్రాలు పాప పుణ్యాలను మూడు రకాలుగా వర్గీకరించాయి.
అవే 1) శరీరంతో చేసే పాపాలు. 2) మనసుతో చేసే పాపాలు. 3) వాక్కుతో చేసే పాపాలు.
శరీరంతో చేసే పాపాలు: పరస్త్రీ వ్యామోహం, మనలను అంటి పెట్టుకుని ఉన్న జంతువులు, పక్షులను హంసించడం. ఏదో ఒక ఆయు ధంతో ఇతరులపైకి ఘర్షణలతో దాడి చేయడం, శారీరక వ్యాధులు.
మనసుతో చేసే పాపాలు: పరుల సొమ్ము అపహరించాలను కోవడం, ఇతరులను పురోగతిని చూసి ఈర్ష్య పడడం, ఇతరులకు హాని కలిగించే ఆలోచనలు చేయడం వంటివి.
వాక్కుతో చేసే పాపాలు: ఇతరులు బాధపడేటట్లు మాట్లాడటం, అసత్యం చెప్పడం, అసూయతో ఫిర్యాదులు చేయడం వంటివి. మనసు తో చేసే పాపాలకు మానసిక దు:ఖాలు, శరీరంతో చేసే పాపాలకు అనా రోగ్యం, శారీరక సమస్యలు వంటివి సంభవిస్తాయి. ఇక వాక్కుతో చేసే పాపాలకు వాక్కుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇదేవిధంగా పుణ్యకార్యాలు చేస్తే మంచే సిద్ధిస్తుంది. మనకున్న సంపదలో కొంత లేని వారితో పంచుకోవడం, మధురంగా మాట్లాడటం, ఇతరులు మాట్లాడే సమయంలో ఔదార్యం ప్రదర్శించడం, సత్యవచనం చేయడం, ధర్మ బద్ధంగా నడవడం, పరస్త్రీల పట్ల మాతృభావంతో వ్యవహరించడం, ఇవన్నీ పుణ్యకార్యాలు.
పాపపుణ్యాలను మన శాస్త్రాలు వర్గీకరించాయి. ధర్మం ఒక్కటే అందరికీ సంపదను, శ్రేయస్సును సమకూరుస్తుంది. అందుకే మనం ధర్మబద్ధంగా, ధార్మికమైన జీవన విధానంలో కొనసాగుతూ, శ్రేయ స్సును పొందుదాం. (ఇది కోయంబత్తూరులో ఇచ్చిన ఉపదేశ సారం నుండి)
ఇప్పుడు ”శ్రద్ధ” గురించి తెలుసుకుందాం. భగవంతుని గురించి ఆలో చించకుండా ఒక ముహూర్తం- అంటే 48 నిమిషాలు గడిచినా, మన సంపదను దొంగలు అపహరించినట్లుగా చింతించాలి. రోధిం చాలి. అటువంటి మనస్తత్వం ఉండాలి అందరికీ. అయితే దీనిని చాలా మంది వ్యతిరేకించవచ్చు. మేము ప్రతీ నిత్యం అనుష్టానం చేస్తున్నాము. శివపూజ విష్ణు పూజ వంటివి చేస్తు న్నాము, విష్ణు సహస్రనామ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రము వంటివి చేస్తున్నాము. కాబట్టి, ముహూర్త కాలంకంటే ఎక్కువ కాలాన్నే చేస్తున్నాము, అంటూ ఒప్పుకోరు. కాని దానిలో ఏకాగ్రత, చిత్తశుద్ధి లోపిస్తున్నాయి. లౌకిక విషయాలు, సంసార విషయాలు చర్చిస్తూనే నామ సంకీర్తన చేయడం వంటివి జరుగు తున్నాయి. అందుకే ఒక ముహూర్త కాలం అయినా, త్రికరణ శుద్ధిగా చేయట్లేదు. శ్రద్ధతో చేసిన పూజ నామస్మరణ, జపాలు, మహత్తరమైన ఫలితాలు ఇస్తాయి.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేస్తూ —
”అశ్రద్ధ యా హుతం దత్తం తపస్తపం కృతం చ యత్,
అసదిత్యుచ్యతే పార్థ న చ త్ప్రేత్యనో ఇహ”
”అశ్రద్ధతో చేసిన యజ్ఞంకాని, దానం కాని, తపస్సు కాని ఆశించిన ఫలితాలు ఇవ్వవు.” అని భావం. మన పూర్వీకులు శ్రద్ధతో కర్మానుష్టానం చేసి, మనకు మార్గదర్శకులయ్యారు. సత్ఫలితాలు కోరుకొంటాం. కాని శ్రద్ధతో పనిచేయము. ఇది మూర్ఖ త్వమే. శ్రద్ధతో చేసే ఏ పనైనా కార్యం సిద్ధిస్తుంది. శాస్త్ర వచనాల మీదో, గురువు బోధించిన విషయాల మీదో త్రికరణశుద్ధిగా శ్రద్ధగా ఆచరించడం శుభఫలితాలు వస్తాయి. ఈ సంసా ర తాపత్రయం ఎప్పుడూ ఉండేదే. కాని జీవితానికి కావలసిన మోక్ష మార్గాన్ని భగవంతునిపై శ్రద్ధతో. చేసే ఆరాధనతో కాని సిద్ధించదు.” అని మనకు ఒక హచ్చరిక చేసారు.
కాబట్టి పై రెండు విషయాలలోని సమాచారం గ్రహంచి ధర్మంగా, స త్యంగా, జీవిస్తూ ఆ పరమాత్మ ఆదరణను పొందుదాం.
(మిగిలిన అంశాల ఉపదేశామృత సారం మరోసారి)
జగద్గురు ఉపదేశామృతం
Advertisement
తాజా వార్తలు
Advertisement