Saturday, November 23, 2024

గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా ?

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ రెండు వ్యాక్సిన్‌లను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏ వ్యాక్సిన్ మంచిదనే సందేహాలు ఎక్కువయ్యాయి. మరోవైపు గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అన్న సందేహం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. గర్భిణీ స్థ్రీలపై వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇంకా శాస్త్రీయ ఆధారాలు వెల్లడి కాలేదు. అయితే, కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఇస్తున్న టీకాలు గర్భిణులకు కూడా సురక్షితమేనని నిపుణులు చెబుతున్నారు. టీకాల వల్ల గర్భంలోని మాయకు హాని కలుగుతుందని చెప్పడానికి ఆధారాలు లభించలేదని వెల్లడించారు. ఈ మేరకు అమెరికాలోని నార్త్‌ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన ఫీన్‌ బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జెఫరీ గోల్డ్‌స్టీన్ తెలిపారు.

కరోనా టీకాలు వేయించుకున్న 84 మందిని, వేయించుకోని 116 మంది గర్భిణులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్టు వివరించారు. టీకాల వల్ల మాయకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తేలిందన్నారు. అయితే, ఇది ప్రాథమిక నిర్థారణ మాత్రమేనని, మరింత మందిని అధ్యయనం చేయడం ద్వారా అంతిమంగా ఓ నిర్ణయానికి రావొచ్చన్నారు. గర్భస్థ శిశువుకు కరోనా సంక్రమించకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం తల్లికి టీకా వేయడమేనని, ఆమె ద్వారా యాంటీబాడీలు శిశువుకు కూడా చేరుతాయని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు  గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదనేది వైద్యుల అభిప్రాయం. ఇక పీరియడ్స్‌లో ఉన్న మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. సాధారణ రుతుక్రమం సమయంలో మహిళలు వ్యాక్సిన్ తీసుకుంటే ఇబ్బంది లేదంటున్నారు వైద్య నిపుణులు. రుతుక్రమానికి వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయితే రక్తస్రావం ఎక్కువగా జరిగినప్పుడు గానీ, ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు గానీ వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఎందుకంటే ఈ సమయంలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండి సమస్యలు వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు.

కాగా, ప్రస్తుతం ఇండియాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో కోవ్యాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లు ప్రధాన భూమిక వహిస్తున్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవ్యాగ్జిన్‌లు.

ఇదీ చదవండి: B.1.617 భారత్‌ రకం స్ట్రెయిన్ అని WHO చెప్పలేదు: కేంద్రం‌

Advertisement

తాజా వార్తలు

Advertisement