ఎన్టీఆర్ బ్యూరో , ఆంధ్రప్రభ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ దర్శించుకున్నారు. దుర్గమ్మను దర్శించుకున్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అమ్మవారి చిత్రపటం లడ్డూ ప్రసాదం శేష వస్త్రాన్ని మంత్రి ఇతర అధికారులు అందజేశారు.
అంతకుముందు అమ్మవారి ఆలయానికి వచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కి ఆలయ మర్యాదలతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో కేఎస్ రామారావు లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కు మంత్రితోపాటు ఆలయ అధికారులు పూర్తిస్థాయిలో వివరించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఆలయ రాక సందర్భంగా పోలీసులు విస్తృతంగా బందో బస్తూ ఏర్పాటు చేశారు.