విజయవాడ – ఇంద్రకీలాద్రిపై నాలుగోరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.
ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. వీఐపీల దర్శనాల విషయంలో అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. పాసుల జారీకి ప్రత్యేక యాప్‌తో పాటు సమన్వయ అధికారులను ఏర్పాటు చేస్తున్నారు. 21 కేటగిరీల్లో వీఐపీ పాసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు..
భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు పాలు, తాగునీరు, మెడికల్ వసతులను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు పోలీసు సేవాదళ్, రెడ్ క్రాస్ వాలంటీర్లు చర్యలు చేపడుతున్నారు
- Advertisement -
సొంత వాహనాలను కొండపైకి అనుమతించడం లేదని అధికారులు చెప్పారు. వీఐపీ పాసులు ఉన్నవారు పున్నమి ఘాట్‌కు రావాలని సూచించారు.