లిటిల్ ఇంగ్లండ్‌గా పేరున్న బార్బడోస్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. 400 ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి విముక్తి లభించింది. ఈ కెరేబియన్ ద్వీపానికి ఇప్పటిదాకా రాణిగా ఉన్న ఎలిజబెత్-2 ఇక ఆ దేశానికి అధిపతిగా వ్యవహరించరు. ఎలిజబెత్ బార్బడోస్‌కు శుభాభినందనలు తెలియజేశారు. బార్బడోస్ ఇకనుంచి సర్వసత్తాక రిపబ్లిక్‌గా వ్యవహరిస్తుంది. తొలి అధ్యక్షురాలు డేమ్ సంద్రా మేసన్‌కు ఎలిజబెత్ రాణి ఒక సందేశం పంపారు.
కొత్త పాత్రలో, కొత్త బాధ్యతల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు ఎలిజబెత్ రాణి. బార్బడోసియన్లు శాంతి, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కూడా ఆశీర్వదించారు. ఇప్పటిదాకా బార్బడోస్, బ్రిటన్ ఉమ్మడి విలువలతో కలిసి నడిచామని ఆమె గుర్తు చేశారు. పర్యావరణం మీద తాజాగా చేస్తున్న ఉమ్మడి కృషిని ఆమె గుర్తు చేశారు. ప్రిన్స్ చార్లెస్ బార్బడోస్ స్వాతంత్ర్య వేడుకలకు గాను అక్కడికి వెళ్లారు.