Monday, November 18, 2024

అక్రమ బాణసంచా సామాగ్రి స్వాధీనం..

గిద్దలూరు ప్రభన్యూస్ : మండలంలోని ముండ్లపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచను గిద్దలూరు ఎస్సై బ్రహ్మనాయుడు స్వాధీనం చేసుకున్నారు. ముండ్లపాడు గ్రామంలో బాణసంచా సామాగ్రి పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారం మేరకు ఎస్ ఐ బ్రహ్మనాయుడు సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. అందులో భాగంగా ఒకరిని అదుపులోకి తీసుకుని బాణసంచాను పోలీస్ స్టేషన్ కి తరలించి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ నెల 2వ తేది ఆంధ్రప్రభ లో హోల్సేల్ ముసుగులో రిటైల్ వ్యాపారం అనే శీర్షికతో కథనం ప్రచురితం కాగా.. జిల్లా ఎస్పీ మాలిక గార్గ్ స్పందించి జిల్లా వ్యాప్తంగా దాడులకు ఆదేశించారు. అందులో భాగంగా గిద్దలూరు ప్రాంతంలో కూడా దాడులు నిర్వహించారు. ముండ్లపాడు,కె.ఎస్.పల్లి,గిద్దలూరు పట్టణంలో పెద్ద ఎత్తున బాణసంచా సామాగ్రి అక్రమ నిల్వలు ఉన్నట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement