Tuesday, November 19, 2024

అది ఉంటే ఇది ఉండదు…ఇది ఉంటే అది ఉండదు – కేంద్రంపై మీరచోప్రా విమర్శలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమా లో నటించిన మీరా చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. అయితే మీరా చోప్రా తాజాగా కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనా కారణంగా కేవలం వారం రోజుల్లో ఆమె కుటుంబంలో ఇద్దరు సభ్యులు చనిపోయారని…కరోనా ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆస్పత్రుల్లో బెడ్లు లభించలేదు.

ఒకవేళ దొరికినా ఆక్సిజన్ దొరకడం లేదు అని విమర్శించారు. కనీస సౌకర్యాలు కూడా లేవని అలాంటప్పుడు ప్రజలు 18% జిఎస్టి ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. ప్రజలకు సౌకర్యాలను కల్పించలేనప్పుడు జిఎస్టీ ని తొలగించాలని డిమాండ్ చేశారు. కనీసం ఆస్పత్రిలో బెడ్ కూడా లేనప్పుడు జిఎస్టి ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement