Wednesday, November 20, 2024

ఆంజనేయస్వామి స్వయంభూ దివ్యక్షేత్రం!

ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టతగల హనుమ దివ్యక్షేత్రం. శిఖరంలేని ఆల యం. ఆంజనేయస్వామి స్వయంభూ దివ్యక్షేత్రం. ఆంజనేయస్వామి మద్ది వృక్షపు తొర్రలో వెలిసిన దైవం. మద్ది చెట్టే స్వామివారి గర్భాలయానికి గోపు రంగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ఆంజనేయస్వామి కుడిచేతిలో గద, ఎడమ చేతిలో ఫలం ఉండి అడుగు ముందుకు వేసినట్టుగా ఉండటం విశేషం. స్వామివారి చేతిలో గద భక్తునికి అభయం ఇస్తుంది. పండు ఫలప్రదం. స్వామివారు ముందుకు వేసిన అడుగు తనను కొలిచిన భక్తులకు తక్ష ణం అనుగ్రహం ఇచ్చే అంశాలుగా భక్తులు నమ్ముతారు. ప్రతి నిత్యం భక్త జన సమూహంతో కళకళలాడే ఈ సుప్రసిద్ధ క్షేత్రంలో భక్తుల కొంగుబంగారంగా కొలువుతీరివున్నాడు మద్ది ఆంజనేయస్వామి.
ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం, గుర వాయిగూడెంలో బయనేరు నదీ తీరంలో ఎర్రకాలువ డాంకు సమీపంలో ఉంది. ఈ క్షేత్రంలో ఆంజనేయస్వామి తెల్ల మద్దిచెట్టు తొర్రలో స్వయంభూగా కొలువుతీరడం వెను క మూడు యుగాలతో ముడిపడిన చరిత్ర. గర్గ సంహిత, పద్మ పురాణము, శ్రీ రామా యణములలో చెప్పబడిన ఓ భక్తుడి దివ్య జీవితానికి రూపం.
అన్నగారైనా రావణాసురుడు చేసే దుష్ట పనులు నచ్చని వ్యక్తి విభీషణుడు. రావణుడి చర్యలను వ్యతిరేకించేవాడు. అలాగే రావణాసురుడి దుష్టత్వాన్ని వ్యతిరేకించే మరో రాక్షసుడు లంకలో ఉండేవాడు. అతనే మధ్వాసురుడు. రావణుడి సేనలోని అతను కత్తిపట్టను, జీవహింస చేయను అనేవాడు. రావణుడు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసేవా డు. సీతమ్మను వెదుకుతూ లంకలోకి ప్రవేశించిన ఆంజనేయస్వామి విధేయత మధ్వాసు రుడుకి నచ్చింది. ఆయనకు వీరభక్తుడుగా మారిపోయాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని స్మరిం చినట్లు మధ్వాసురుడు నిరంతరం ఆంజనేయస్వామి నామాన్ని జపించేవాడు. రామరా వణ యుద్ధంలో పాల్గొనమని మధ్వాసురుడికి పిలుపు వచ్చింది. దాంతో ఏంచేయాలో పాలుపోక అస్త్ర సన్యాసం చేసి హనుమంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఆత్మత్యాగం చేశాడు.
ద్వాపరయుగంలోనూ మళ్లిd మధ్వాసురుడు మధ్వకుడు అనే పేరుతో జన్మించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులవైపు నిలిచి యుద్ధం చేస్తూ అర్జునుని రథంపైనున్న ‘కవిరా జు’ (ఆంజనేయస్వామి)ని చూసి తన గతజన్మ గుర్తుకువచ్చి స్వామిని త్వరితగతిన చేరే క్రమంలో అస్త్రసన్యాసం చేసి ప్రాణత్యాగం చేసుకున్నాడు.
కలి యుగంలో మద్యుడు అనే పేరుతో జన్మించాడు. హనుమ అనుగ్రహానికి తపస్సు చేయాలన్న సంకల్పంతో ఎర్రకాలువ ఒడ్డున ఒక కుటీరం ఏర్పాటుచేసుకుని ప్రతీ దినం కాలువలో దిగి స్నానం చేసి తపస్సు చేస్తూ కూర్చునేవాడు. అలా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ఆయన ఒకరోజు ఉదయం ఎర్రకాలువలో స్నానంచేసి పైకి వస్తున్న క్రమం లో జారి పడబోయినపుడు ఎవరో పట్టుకుని ఆపినట్టుగా ఆగిపోయారు. ఒక కోతి చేయి అందించి పడకుండా ఆపింది. అంతేకాక ఒక ఫలం కూడా ఇచ్చి వెళ్ళిపోయింది. తన ఆకలి తీర్చడానికి ఫలం ఇచ్చిన ఈ వానరం ఎవరో అని మహర్షి ఆలోచించలేదు. అదే క్రమంలో నిత్య అనుష్ఠానం కొనసాగించడం, ప్రతీరోజూ కోతి వచ్చి ఫలం ఇవ్వడం, దాని ని మధ్వ మహర్షి స్వీకరించడం జరిగేది. ఒకరోజు తనకు రోజూ ఫలం ఇస్తున్న వానరం హనుమగా గుర్తించి ”స్వామీ! ఇన్నిరోజులు మీతో సపర్యలు చేయించుకున్నానా? నేను ఎంత పాపాత్ముడను, జీవించి ఉండటం అనవసరం” అని విలపిస్తాడు. అప్పుడు ఆంజనే యస్వామి ప్రత్యక్షమై ‘మధ్వా! ఇందులో నీ తప్పు లేదు. నీ స్వామి భక్తికి మెచ్చి నేనే నీకు సపర్యలు చేశాను. ఏమి వరం కావాలో కోరుకో” అంటాడు.
అప్పుడు మధ్వ మహర్షి భక్తిపారవశ్యంతో ”స్వామీ మీరు ఎల్లప్పుడూ నా చెంతే ఉండాలి” అని కోరతాడు. ఆంజనేయస్వామి ”నీవు అర్జున వృక్షానివై (తెల్ల మద్దిచెట్టు) ఇక్కడ అవతరించు. నేను నీ సమీపంలో శిలారూపంలో స్వయం వ్యక్తమవుతాను. నీ కోరిక ప్రకారం ఎల్లప్పుడూ నీ చెంతనే ఉంటూ, మన ఇరువురి నామాలతో కలిపి ‘మద్ది ఆంజనేయుడు’గా కొలువై వుంటాను” అని వరం ఇచ్చి అక్కడ వెలిశారు ఆంజనేయ స్వామి. అనంతర కాలంలో ఆంజనేయస్వామి ఒక భక్తురాలికి స్వప్నంలో దర్శనమిచ్చి ”తాను ఇక్కడ చెట్టు తొర్రలో ఉన్నట్టు స్వామి చెప్పడంతోపాటు శిఖరం లేకుండా చెట్టే శిఖరంగా ఉత్తరోత్తరా ఆలయ నిర్మాణం చేయమని చెప్పినట్టు స్థానికుల కథనం.

అభయప్రదాత ఈ స్వామి

ఈ మద్ది ఆంజనేయస్వామి సన్నిధిలో భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. వివాహం కానివారు, వైవాహిక బంధంలో ఇబ్బందులు ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపా రంలో నష్టాలు, ఉద్యోగంలో ఉన్నతిలేనివారు… ఇలా ఒకటేమిటి అనేక ఈతిబాధలు ఉండి ఏ పనిచేసినా కలిసిరానివారు ముందుగా స్వామిని దర్శించి తమ కోరికను స్వామికి మనస్సులో విన్నవించి ఏడు మంగళవారాలు 108 ప్రదక్షిణలు చేసి వారి కోరిక తీవ్రతను బట్టి అర్చక స్వాములు సూచించిన విధంగా కొన్నివారాలు ప్రదక్షిణలు చేస్తారు. కోరిక తీరిన తర్వాత మరో 108 ప్రదక్షిణలు చేస్తారు. అంతేగాదు శనిదోషాలు, గ్రహదోషాలు నివా రణకు శనివారం పూజ ఇక్కడి విశేషం. అంగారక, రాహు దోషాలతోపాటు ఎటువంటి దోషాలు అయినా స్వామి పూజతో తొలగుతాయని భక్తుల విశ్వాసం.

ఆధ్యాత్మిక శోభ

ఈ క్షేత్రం ఆంజనేయస్వామికి ప్రతి నెలా కళ్యాణం జరుపుతారు. ప్రతీనెలా స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం రోజున సువర్చలా హనుమ కల్యాణం వైభవంగా చేస్తారు. ప్రతీ శనివారం పంచామృత అభిషేకం, ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో 108 బంగారు తమలపాకులు, 108 వెండి తమలపాకులతో స్వామివారిని పూజిస్తారు. నిత్య పూజలతోపాటు విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తిక మాసం నెల రోజులు ఈ క్షేత్రం పండుగ వాతావరణాన్ని సంతరించు కుంటుంది. ఈ నెలలో వచ్చే ప్రతి మంగళవారం స్వామివారికి లక్ష తమలపాకులతో ఆకు పూజలు నిర్వహిస్తారు. హనుమజ్జయంతికి అయిదు రోజులు పాంచహ్నిక దీక్షగా నిర్వహిస్తారు. వైశాఖ బహుళ నవమి నుండి వైశాఖ బహుళ త్రయోదశి వరకు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు.
చాలా సంవత్సరాల క్రితమే ఈ ఆలయంలో హనుమత్‌ దీక్షలను చేపట్టడం ప్రారంభించారు. అప్పటి నుంచి వేలాదిమంది భక్తులు ప్రతీ సంవత్సరం మండలం రోజులు హనుమద్‌ దీక్షలు చేసి స్వామివారి సన్నిధిలో హనుమద్‌ వ్రతం రోజు ఇరుముడి సమర్పిస్తారు. ఈ రీతిగా ముందుగా దీక్షా స్వీకారం చేసి హనుమ కృపతో దీక్షను భక్తితో పూర్తిచేస్తారు. ప్రతి మంగళవారం స్వామివారిని దర్శనానికి దేశం నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement