హన్మకొండ జిల్లా : వరంగల్ నగరంలోని హన్మకొండలో కారులో కుళ్లిన శవం కలకలకం రేపింది. హన్మకొండలోని ఏనుగులగడ్డ సమీపంలో స్నేహాబార్ ఎదుట తీవ్ర దుర్గంధం వచ్చింది. దీంతో స్థానికులు పరిశీలించగా.. గత నాలుగైదు రోజులుగా అక్కడే పార్క్ చేసి ఉన్న ఇన్నోవా కారులో కుళ్లిన శవం కనిపించింది. మృతుడు పెద్దమ్మ గడ్డకు చెందిన వెల్పుకొండ రమేశ్ గా స్థానికులు, పోలీసులు గుర్తించారు. అయితే రమేశ్ అదే ప్రాంతంలోని నర్సింగ్ అనే స్వీట్ హౌస్ యజమాని వద్ద రెండు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. అయితే మృతదేహం కనిపించిన కారు సైతం స్వీట్ హౌస్ నర్సింగ్ దేనని బంధువులు చెబుతున్నారు. స్వీట్ హౌస్ నర్సింగ్ పై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ మృతుడు రమేష్ తన దగ్గర పని మానేసి 20 రోజులు అవుతుందని స్వీట్ హౌస్ ఓనర్ నర్సింగ్ పోలీసులకు వివరించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా రమేశ్ మృతిచెందాడని భావిస్తున్నా నాలుగైదు రోజుల క్రితం సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అదేవిధంగా ఇన్నోవా కార్ తాళం చెవులు తన దగ్గర లేవని, అవి తన దగ్గర మిస్ ప్లేస్ అయ్యాయని స్వీట్ హౌస్ ఓనర్ అనడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మేరకు పోలీసులు అనుమాన్పాద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital