Tuesday, November 19, 2024

పచ్చని ఒడిలో ప్రభుత్వ కార్యాలయాలు..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌): తెలంగాణకు హరిత హరం కార్యక్రమం ఫలితంగా పచ్చని ఒడిలో ప్రభుత్వ కార్యాలయాలు కళకళాడుతున్నాయి. ప్రతి సంవ త్సరం హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో నీడనిచ్చే చెట్లు, పూల మొక్కలు, పండ్ల చెట్లతో పాటు రకరకాల చెట్లను నాటడంతో అవి ఏపుగా పెరిగాయి. ఏడు సంవత్సరాలుగా పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్ళు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలను నాటుతున్నారు. పెద్ద మైదానాలు, ఖాళీ స్థలాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యాలయాలతో పాటు రైతు వేదికలు, ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాల వద్ద లక్షల సంఖ్యలో మొక్కలను నాటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీన్‌ ఫ్రైడే పాటిస్తూ నాటిన మొక్కలకు నీరు పోయడం, కలుపు తీయడం వంటి కార్యక్రమాలతో మొక్కలను సంర క్షిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తే మం చి ఫలితాలు పొందవచ్చని అటవీ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏటా కోట్లలో మొక్కలను నాటడంతో రాష్ట్రంలో క్రమంగా పచ్చదనం పెరుగుతోన్నది. హరితాహారం కార్యక్రమం వలన రాష్ట్రంలో 2019 వరకు సుమారు నాలుగు శాతం అటవీ విస్తీర్ణం పెరిగినట్లు ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. మరో రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించబోతున్నారు. తెలంగాణలో పచ్చదనం శాతం మరింత పెరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement