Friday, November 22, 2024

Good News – విద్యుత్ కాంట్రాక్ట‌ర్ల‌కు తీపి కబురు…

హైద‌రాబాద్ – విద్యుత్ సంస్థలలో కాంట్రాక్టర్స్ గా పనిచేస్తున్న గుత్తే దారులకు తీపి కబురు.గుత్తే దారుల లైసెన్స్ గడువును మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అటు ఎన్ పి డి సి యల్ ఇటు యస్ పి డి సి యల్ లలో కాంట్రాక్టులు చేస్తున్న కాంట్రాక్టర్లకు వెసులుబాటు కలిగించినట్లైంది.అంతే గాకుండా లైసెన్స్ రుసుము కుడా భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయం ఈ నెల తొమ్మిది నుండి అమలులోకి వస్తుంది.తెలంగాణా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సుదీర్ఘ కాలంగా రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చి లైసెన్స్ గడువును ఐదు సంవత్సరాలకు పెంచుకునేల ఉత్తర్వులు విడుదల చేయించారు.

రెండో మారు బి ఆర్ యస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు లతో సమావేశమైన రాష్ట్ర ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ యస్ యస్ ఆర్ రేట్లను పెంచుకోవడంతో పాటు విద్యుత్ లైసెన్సింగ్ బోర్డులో ఇద్దరు సభ్యులుగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులను నియమించిన విషయం విదితమే. అదే సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆర్.శివకుమార్,యస్.కే. మాజిద్ అహ్మద్ లు లైసెన్స్ గడువు పెంచాలన్న ప్రతిపాదనను మంత్రి జగదీష్ రెడ్డి ముందు పెట్టారు.అందుకు అనుగుణంగా స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణా రాష్ట్రంలో ఐదు సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 9 న జి ఓ నెంబర్ 22 ఉత్తర్వులు జారీచేశారు.

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి జగదీష్ రెడ్డికి ఆ సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆర్.శివకుమార్,యస్.కే. మాజిద్ అహ్మద్ లతో పాటు లైసెన్సింగ్ బోర్డు సభ్యులు పి.సదానంద్, ఎన్.పర్వతాలులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో ముందెన్నడూ లేని విదంగా లైసెన్స్ గడువును మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు పెంచడం చరిత్రాత్మక నిర్ణయమని వారు అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement