హైదరాబాద్: గ్రామ పంచాయతీల నిధులను, పై అధికారుల అనుమతులు లేకుండానే, ఆయా గ్రామ ప్రజలు, పంచాయితీల తీర్మానం మేరకే ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 91 ని జారీ చేసింది. తద్వారా ఇక నుంచి స్థానిక అవసరాల మేరకు నిధులను ఖర్చుచేసుకునే వెసులుబాటు పంచాయతీలకు లభిస్తుంది. అయితే, గ్రామ సభ ఆమోదం మేరకు గ్రామ అవసరాలకు అనుగుణంగా ఆయా పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆయా పనులన్నీ నిబంధనల మేరకు మాత్రమేగాక, ఆ ఆర్థిక సంవత్సర కేటాయింపులకు మించకుండా మాత్రమే ఖర్చు చేయాలని ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. ఈ జివో విడుదల కావడంపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ వెంటనే జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ జీవో రావడం వల్ల ఇప్పటికే పల్లె ప్రగతితో అభివృద్ధి, పారిశుద్ధ్యం, పచ్చదనం పరుచుకున్న పల్లెలు ఇక ప్రగతిలోనూ మరింతగా పరుగులు పెడతాయని అయన అభిప్రాయపడ్డారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement