Tuesday, November 26, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 24.

యోంత:సుఖోంతరారామ:
తథాంతర్జ్యోతిరేవ య: |
స యోగీ బ్రహ్మనిర్వాణం
బ్రహ్మభూతో ధిగచ్ఛతి ||

తాత్పర్యము : అంతరంగమందే ఆనందమును కలిగినవాడును, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగినవాడును అగు మనుజుడు వాస్తవమునకు పూర్ణుడగు యోగియనబడును. బ్రహ్మ భూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు.

భాష్యము : ముక్త పురుషుడు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండుట వలన బాహ్య ఆనందమునకు ప్రాకులాడడు. అలా ఆంతరంగిక ఆనందమును పొందకపోతే బాహ్య ఆనందము నుండి దూరముగా ఉండుట సాధ్యపడదు కదా? అతడు ఒక చోటనే మౌనముగా కూర్చుని అంతరంగమున జీవితపు సౌఖ్యమునను అనుభవింపగలడు. అటువ ంటి ముక్తుడు భౌతికమైన బాహ్య కోరికల పట్ల ఆకర్షింపబడడు. దీనినే బ్రహ్మ భూత స్థితి అందురు. అటువంటి వ్యక్తి తిరిగి వైకుంఠమునకు వెళ్ళుట తథ్యము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement