Tuesday, November 26, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 11.

కాయేన మనసా బుద్ధ్యా
కేవలైంద్రియైరపి |
యోగిన: కర్మ కుర్వంతి
సంగం త్యక్త్వాత్మశుద్ధయే ||

తాత్పర్యము : యోగులైన వారు సంగత్వమును విడిచి ఆత్మ శుద్ధి యను ప్రయోజనము కొరకు మాత్రమే దేహముచే, మనస్సుచే, బుద్ధిచే మరియు ఇంద్రియములచే కర్మనొనరింతురు.

భాష్యము : ఎప్పుడైతే వ్యక్తి తన శరీరాన్ని, మనస్సును, బుద్ధిని భగవంతుని సంతృప్తి కొరకు వినయోగిస్తాడో అప్పుడ భౌతిక కల్మషము నుండి బయటపడతాడు, నేను ఈ దేహాన్ని కాదు. ఈ దేహము నకు సంబంధించినది కాదు. నేను, నా దేహమూ రెండూ కృష్ణునికి సంబంధించనవనే భావనలో దేహము, మనస్సు, బుద్ధి, వాక్కు, ధనము, జీవితము ఇలా తనకున్న సర్వస్వాన్ని కృష్ణుని సేవలో వినియోగిస్తాడో అప్పుడు అతడు కృష్ణునితో సంబంధాన్ని పూర్తిగా పునరుద్ధరించుకుంటాడు. నేను కృష్ణునికి చెందిన వాడిని అనే భావన వలన స్వార్ధ అహంకారాన్ని, ”నాది” అనే మమకారాన్ని విడనాడి కృష్ణచైతన్య పరి పక్వస్థితికి చేరుకుంటాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement